దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఖమ్మం జిల్లాలో చోరీకి వచ్చిన ఐదుగురు దొంగలు ఊహించని రీతిలో పోలీసులకు చిక్కారు. రెడ్డిపల్లి దాబాలోకి చొరబడి విలువైన వస్తువులు దోచుకున్న అనంతరం, అక్కడ కనిపించిన మద్యం బాటిళ్లతో పార్టీ చేసుకున్నారు. తెల్లవారే వరకు మద్యం సేవించి దాబాలోనే నిద్రపోయారు. యజమాని సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకోగా ముగ్గురు పారిపోయారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు దొంగలు మాత్రం పట్టుబడ్డారు. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చోరీకి వచ్చిన దొంగలు అలికిడి అయితే ఎవరి కంటపడతామో ఏమోనని భయపడుతూ మొత్తానికి వచ్చినపని ముగించుకుని వెళ్తారు. కానీ ఖమ్మం జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది. చోరీకి వచ్చిన దొంగలు అక్కడ భారీగా మద్యం కనిపించడంతో అక్కడే సిట్టింగ్ వేశారు.. ఆ తర్వాత కటకటాల వెనక్కి వెళ్లి ఊచలు లెక్కిస్తున్నారు. ఖమ్మం జిల్లా, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి వద్ద ఒక దాబా ఉంది. అర్థరాత్రి వేళ ఐదుగురు దొంగలు పక్కా ప్లాన్‌తో దాబాలోకి చొరబడ్డారు. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన వారు, అక్కడ ఉన్న విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొదటి దఫా చోరీని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆ దొంగలు, మరికొన్ని వస్తువుల కోసం తిరిగి దాబాలోకి వచ్చారు. అయితే, అక్కడ కనిపించిన మద్యం బాటిల్స్ వారిని కదలనివ్వలేదు.ఇంకేముంది.. వచ్చిన పని పక్కనపెట్టి…ఆ దొంగలు దాబాలోనే ‘పార్టీ’ మొదలుపెట్టారు. తెల్లవారే వరకు మందు కొడుతూ, ఎంజాయ్ చేస్తూ అక్కడే పడుకొని నిద్రపోయారు. ఉదయాన్నే దాబా తెరవడానికి వచ్చిన యజమాని లోపలి దృశ్యం చూసి షాకయ్యాడు. మద్యం మత్తులో తూలుతున్న దొంగలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి ముగ్గురు దొంగలు పారిపోయారు. ఇద్దరు మాత్రం మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉండటంతో సులభంగా దొరికిపోయారు. తాము చోరీ చేయడానికి వచ్చి, మద్యం మత్తులో బయటపడలేకపోయామని ఆ దొంగలు పోలీసుల విచారణలో అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు పరారైన మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్ చూసి గుండె గుభేల్
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి.. ఎందుకో తెలిస్తే వెన్నులో వణుకే!
దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్ చూసి గుండె గుభేల్
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్

