AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!

బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!

Phani CH
|

Updated on: Aug 18, 2026 | 6:27 PM

Share

మహారాష్ట్రలోని నలసోపారాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకల్లో కేక్‌ తిన్న 11 మంది అస్వస్థతకు గురయ్యారు. కేక్‌లో చనిపోయిన బల్లి కనిపించడంతో కలకలం రేగింది. బాధితుల్లో ఏడుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు. కడుపు, ఛాతిలో నొప్పితో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఘటనపై పోలీసులు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో వరుస ఆహార భద్రత ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

పుట్టినరోజు వేడుకలకు ఉత్సాహంగా హాజరైన అతిథులకు చేతు అనుభవం ఎదురైంది. బర్త్‌డే సందర్భంగా కట్‌ చేసిన కేకు తిన్న 11 మంది అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. మహారాష్ట్రలోని నలసోపారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బర్త్‌డే వేడుకల్లో భాగంగా కట్ చేసి తిన్న కేక్‌లో చనిపోయిన బల్లి ఉండటాన్ని వారు గుర్తించారు. అప్పటికే ఆ కేక్ తినడం వల్ల ఏడుగురు పిల్లలు, నలుగురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ ఒక్కసారిగా కడుపు, ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. థానేలోని కళ్యాణ్‌లో ఒక స్టోర్‌లోని ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో ఎలుక ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. అలాగే మలాడ్‌లోని మరో కేంద్రంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పలు ఉల్లంఘనలను గుర్తించి ఆ సంస్థ లైసెన్స్‌ను నిలిపివేశారు. వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు!

అది ఇల్లా.. బంగారు గనా..! రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం

మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్‌ జీపీటీని అడగండి.. ఇట్టే దొరికేస్తాయ్‌

Follow Us