అది ఇల్లా.. బంగారు గనా..! రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
బెల్జియంలోని ఈస్ట్ ఫ్లాండర్స్‌లో ఇంటి పునరుద్ధరణ పనులు చేస్తుండగా భారీ బంగారు నిధి బయటపడింది. డ్రైనేజీ వ్యవస్థ కోసం పునాదుల వద్ద తవ్వకాలు జరుపుతున్న కార్మికులకు బంగారు నాణేలు, బిస్కెట్లు కనిపించాయి. వాటి విలువ సుమారు 9 మిలియన్ యూరోలు, భారత కరెన్సీలో దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. సైట్ మేనేజర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నిధి ఎవరిదనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇల్లు బాగు చేయించుకుందామని తవ్వకాలు జరిపితే ఏకంగా వంద కోట్ల రూపాయల నిధి బయటపడితే ఎలా ఉంటుంది? బెల్జియంలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. ఈస్ట్ ఫ్లాండర్స్‌లో ఓ పురాతన భవనం రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా డ్రైనేజీ సిస్టమ్ మార్పు కోసం ఇంటి పునాదుల వద్ద కార్మికులు డ్రిల్లింగ్ చేపట్టారు. ఆ సమయంలో డ్రిల్లింగ్ మిషన్‌కు ఏదో పసుపు రంగు అంటుకోవడం గమనించిన కార్మికులు ఆశ్చర్యపోయారు. మరింత లోతుగా తవ్వి చూడగా కుప్పలు కుప్పలుగా బంగారు నాణేలు, బిస్కెట్లు బయటపడ్డాయి. సుమారు 9 మిలియన్ల యూరోలు, అనగా భారత కరెన్సీలో దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఈ భారీ నిధిని చూసి వారంతా ఖంగుతిన్నారు. సైట్ మేనేజర్ మారియోకు ఈ విషయం తెలపగా.. ఆయన ఏమాత్రం ఆశపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. బెల్జియం చట్టాల ప్రకారం ఈ నిధిని క్లెయిమ్ చేయడానికి ఐదేళ్ల సమయం ఉంటుందని, ఆ నిధికి సంబంధించి ఎవరైనా అసలు ఓనర్ ఉంటే వచ్చి ఐదేళ్లలోపు క్లెయిమ్ చేసుకోవాలని, లేనిచో అది ఆ స్థలం యజమానికి, కార్మికులకు చెందుతుందని అధికారులు తెలిపారు. ఈ అపారమైన సంపద ఇక్కడకు ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి.. ఇట్టే దొరికేస్తాయ్
రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్
దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం
రాచనాగుతో మామూలుగా ఉండదు మరి.. ఒకేరోజు రెండు కింగ్ కోబ్రాలు..
ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం

