AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమ్ముడూ.. ఒక్కసారి పలకరించరా' బ్రహ్మానందం సోదరుడి ఆవేదన.. హాట్ టాపిక్ అన్నదమ్ముల వ్యవహారం

తమ్ముడూ.. ఒక్కసారి పలకరించరా’ బ్రహ్మానందం సోదరుడి ఆవేదన.. హాట్ టాపిక్ అన్నదమ్ముల వ్యవహారం

Phani CH
|

Updated on: Aug 20, 2026 | 3:17 PM

Share

టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కుటుంబ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన అన్నయ్య వదన్ తన తమ్ముడి నుంచి ఒక్క ఫోన్ కాల్, పలకరింపు కోసం ఎదురుచూస్తున్నానంటూ భావోద్వేగ వీడియో విడుదల చేశారు. దీనిపై స్పందించిన బ్రహ్మానందం, తన అన్నయ్య మానసికంగా బలహీనంగా ఉన్నారని, ఎవరో యూట్యూబర్ మాట్లాడించడంతో అలా చెప్పారని తెలిపారు. తాను అన్నయ్య కుటుంబానికి ఎంతో సాయం చేశానని స్పష్టం చేశారు.

హాస్య బ్రహ్మగా టాలీవుడ్‌లో గొప్ప గుర్తింపు తెచ్చుకుని.. తెలుగు వాళ్ల గుండెళ్లో చిరస్థాయిగా నిలిచేంత క్రేజ్ సంపాదించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు తన సొంత అన్న కారణంగా.. ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ కారణంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. బ్రహ్మానందానికి ఆరుగురు తోబుట్టువులు. అందులో నలుగురు కాలం చేయగా.. బ్రహ్మానందం, వదన్ మాత్రమే ఇప్పుడు ఉన్నారు. అయితే బ్రహ్మానందానికి అన్నయ్య అయిన వదన్ ఇప్పుడు వృద్దాప్యంలో బతుకీడుస్తున్నారు. ఈ క్రమంలో తన తమ్ముడైన బ్రహ్మానందం..‘అన్నయ్యా’ అంటూ రెండు మాటలు మాట్లాడితే విందామని ఎదురుచూస్తున్నట్లు వాపోయాడు.ఈ మేరకు ఆయన ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వయసులో ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది తానొక్కడినే అని వదన్ అంటున్నారు. ఈ మధ్యనే తన తమ్ముడు బ్రహ్మానందం తమ ఊరికి వచ్చి.. కనీసం పలకరించకుండానే వెళ్లిపోవడం తనను కలిచివేసిందని చెబుతున్నారు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి “అన్నయ్యా.. ఎలా ఉన్నావ్?” అని అడుగుతాడేమో అని ఆశగా ఎదురుచూస్తున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు. గొప్పవాళ్లు పలకరిస్తే చిన్నవాళ్లకు ఎంతో సంతోషంగా ఉంటుంది. తమ్ముడి నుంచి ఒక్క ఫోన్, ఒక్క పలకరింపు కోసం ఈ వృద్దాప్యంలో ఎదురుచూస్తున్నా.. అంటూ వదన్ చెబుతుండం అందర్నీ కలిచివేస్తోంది. ఈయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ బ్రహ్మానందం వైపే వేలెత్తేలా చేస్తున్నాయి. దీంతో బ్రహ్మా కూడా దీనిపై మీడియాతో మాట్లాడారు. తన అన్నయ్య వదన్‌..మానసికంగా బలహీనంగా ఉన్నారని బ్రహ్మీ అంటున్నారు. ఎవరో ఒక యూట్యూబర్ మాట్లాడించడంతో.. అలా మాట్లాడారని.. ఆ వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోందని చెబుతున్నారు. తన అన్నయ్యకు, ఆయన కుటుంబానికి తాను చాలా సాయం చేశానని బ్రహ్మానందం చెబుతున్నారు. అయితే బ్రహ్మానందం వర్షెన్ ఎలా ఉన్నా కూడా.. ఈ వయసులో వదన్ చెబుతున్న మాటలు మాత్రం అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pallavi Prashanth: డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ‘బిగ్ బాస్‌’ లాగేసుకుంటే..నేనెట్టా పంచేది!

ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?

Follow Us