AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్

త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 20, 2026 | 4:31 PM

Share

టాలీవుడ్‌లో సీనియర్ దర్శకుల శైలి, మేకింగ్‌ను యంగ్ డైరెక్టర్లు తమదైన పంథాలో కొనసాగిస్తున్నారు. త్రివిక్రమ్ తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్, క్యూట్ పంచ్‌లతో వెంకీ అట్లూరి ఆకట్టుకుంటున్నారు. శ్రీను వైట్ల తరహా యాక్షన్ కామెడీని అనిల్ రావిపూడి కొనసాగిస్తున్నారు. ఇక విలక్షణ కథలు, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీని కలిపి సింగీతం శ్రీనివాసరావు వారసుడిగా నాగ్ అశ్విన్ తనదైన ముద్ర వేస్తున్నారు. టాలీవుడ్‌లో ఈ కొత్త తరం దర్శకులపై ఆసక్తి పెరుగుతోంది.

సినిమా ఇండస్ట్రీలో పాతనీరు వెళ్లిపోయి కొత్తనీరు రావడం కామన్.. అచ్చం అలాగే సీనియర్ దర్శకుల ప్లేస్‌ను యంగ్ డైరెక్టర్లు భర్తీ చేస్తూ వాళ్ల మేకింగ్‌కు వారసులుగా మారుతున్నారు. సీనియర్లు మెల్లగా వేరే జోనర్స్‌కు షిఫ్ట్ అవుతుంటే.. ఆ గ్యాప్‌ను ఫిల్ చేస్తూ కుర్రాళ్లు తమదైన స్టైల్‌తో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నారు. మరి టాలీవుడ్‌లో ఏ సీనియర్ డైరెక్టర్ ప్లేస్‌ను ఏ యంగ్ డైరెక్టర్ రీప్లేస్ చేస్తున్నారో చూద్దామా..? ఫ్యామిలీ ఎమోషన్స్, క్యూట్ పంచ్‌లు అనగానే త్రివిక్రమ్ గుర్తుకొస్తారు.. సింపుల్ కథలతో మ్యాజిక్ చేయాలంటే ఈయనే. ఈ ప్లేస్‌ను వెంకీ అట్లూరి భర్తీ చేస్తున్నారిప్పుడు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్‌ని త్రివిక్రమ్ గానీ తీశారా అనేంతగా తీసారు వెంకీ. త్రివిక్రమ్ నెక్ట్స్ ఎన్టీఆర్ సినిమాతో ప్యాన్ ఇండియాకు వెళ్తున్నారు.. దాంతో ఆ స్థానానికి సరైన వారసుడిగా వెంకీ అట్లూరి సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు యాక్షన్, కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీను వైట్ల కొంతకాలంగా ఫామ్‌లో లేరు. సరిగ్గా అదే టైమ్‌లో ఆ లోటు భర్తీ చేస్తూ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. తన మార్క్ కామెడీ, యాక్షన్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో శ్రీను వైట్ల స్టైల్‌ను కంటిన్యూ చేస్తూ ఆయన సీటును అనిల్ పర్ఫెక్ట్‌గా సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు విలక్షణ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుకు నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ రీప్లేస్‌మెంట్‌గా కనిపిస్తున్నారు. కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఫాంటసీని జోడించారు నాగీ. తన అద్భుతమైన విజన్‌తో సరికొత్త సినిమాలు తీస్తూ సింగీతం గారికి వారసుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు నాగ్ అశ్విన్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!

యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు!

వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మటన్‌ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌.. తర్వాత ఏమైందంటే..

 

Follow Us