AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆన్‌లైన్ సేవలు బంద్.. అలర్ట్ అవ్వండి..

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ అలర్ట్. నెట్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు బంద్ కానున్నాయి. శనివారం రోజున నాలుగు గంటల పాటు క్లోజ్ కానున్నాయి. ఈ విషయాన్ని తమ కస్టమర్లకు తెలియజేస్తూ హెచ్‌డీఎఫ్‌సీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వివరాలు ఇలా చూద్దాం.

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆన్‌లైన్ సేవలు బంద్.. అలర్ట్ అవ్వండి..
Hdfc Bank
Venkatrao Lella
|

Updated on: Aug 21, 2026 | 7:18 AM

Share

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఆగస్ట్ 22వ తేదీన ఉదయం 2.30 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు డిజిటల్ సేవలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన సిస్టమ్ మెయింటెనెన్స్ చేపట్టనున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ తమ కస్టమర్లకు ఎస్‌ఎంఎస్, ఈమెయిల్స్ ద్వారా సమాచారం పంపుతోంది. ఈ సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ నెట్ బ్యాంకింగ్, యాప్ సర్వీసులు ఏవీ అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. కస్టమర్లు తమకు సహకరించాలని కోరింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ఖాతాదారులు ముందుగానే తమ పనులు పూర్తి చేసుకోవాలని పేర్కొంది. ఏయే సేవలు నిలిచిపోతాయనే వివరాలను కూడా హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. అవేంటి అనేది ఒకసారి చూద్దాం.

ఏయే సేవలు నిలిచిపోతాయంటే..?

-అకౌంట్స్ తెరవడం

-డిపాజిట్లు చేయడం

-నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేయడం

-ఆన్‌లైన్ పేమెంట్స్

-యాపీఐ సర్వీసులు ఈ సమయంలో అందుబాటులో ఉంటాయి. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్ల నుంచి చేసే లావాదేవీలు ఎప్పటిలాగే కొనసాగుతాయి

-ఈ సమయంలో పేజెడ్ వ్యాలెట్ నుంచి చేసే పేమెంట్స్, నగదు బదిలీలు ఎప్పటిలాగే కొనసాగుతాయని హెచ్‌డీఎఫ్‌సీ స్పష్టం చేసింది. మీ ఓపికకు, సహకారానికి తాము గౌరవం ఇస్తున్నామని, తమ సేవలను మరింత మెరుగుపర్చేందుకు మీ వంతు సహకారం అందిస్తామని తెలిపింది. మీ సర్వీసుల పట్ల మీ నమ్మకానికి ధన్యవాదాలు అంటూ పేర్కొంది.

Follow Us