AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

El Nino 2026: భారత్‌ను భయపెడుతున్న ఎల్ నినో.. చరిత్రలో ఎన్నడూ లేని కరువు రానుందా?

యావత్‌ ప్రపంచాన్ని సూపర్ ఎల్‌నీనో వణికిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఆధునిక వాతావరణ చరిత్రలోనే అన్ని రికార్డులను బద్దలు కొడుతూ సాగుతున్న ఈ వేడి ప్రయాణం, అటు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో పాటు రాబోయే రోజుల్లో వడగాలులు- వరదలను, ఇటు భారతదేశంలో కరువు సంకేతాలను సూచిస్తోంది.

El Nino 2026: భారత్‌ను భయపెడుతున్న ఎల్ నినో.. చరిత్రలో ఎన్నడూ లేని కరువు రానుందా?
Super El Nino 2026
Anand T
|

Updated on: Jul 16, 2026 | 12:02 PM

Share

వేసవి తగ్గి వర్షాకాలం వచ్చినా ఎండలు మాత్రం తగ్గడం లేదు. దీనికి ప్రధాన కారణంగా వేగంగా తీవ్రరూపం దాల్చుతున్న ‘ఎల్ నినో’ అని తెలుస్తోంది. రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్న ఎల్‌నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇది మునుపెన్నడూ లేని విదంగా చరిత్రలోనే అత్యంత బలమైన వాతావరణ మార్పులలో ఒకటిగా నిలువనున్నట్టు అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది మరింత బలపడి, ఉత్తరార్ధగోళ శీతాకాలంలో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

గత రికార్డులను బద్దలు కొట్టే దిశగా..

వాతావరణ శాస్త్రవేత్త జీక్ హౌస్‌ఫాదర్ 14 రకాల వాతావరణ నమూనాల నుండి సేకరించిన 667 అంచనాల విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుత పొంచి ఉన్న ఈ ఎల్ నినో గతంలో కంటే ఎక్కవ వినాశాన్ని సృష్టించిన వచ్చని అంచనా వేస్తున్నారు. అంటే 1982-83, 1997-98, 2015-16 నాటి రికార్డులను కూడా ఇది అధిగమించే అవకాశం ఉందని తెలిపారు. 2015-16లో గరిష్టంగా 2.75°C ఉష్ణోగ్రత వ్యత్యాసం నమోదు కాగా, ఈసారి ఇది ఏకంగా 3.6°C వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ అంచనాలు నిజమేనా? ప్రస్తుత పరిస్థితి ఏంటి?

NOAA డేటా ప్రకారం, జూలై 13 నాటికే పసిఫిక్ మహాసముద్రంలోని నినో 3.4′ ప్రాంతంలో ఉష్ణోగ్రత వ్యత్యాసం 2.2°C కి చేరిందని.. 1982 నుండి ఉపగ్రహ రికార్డులను పరిశీలిస్తే, ఒక క్యాలెండర్ ఏడాదిలో ఇంత ముందుగానే ఈ స్థాయి వేడి నమోదు కావడం ఇదే మొదటిసారని నివేదికలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో వేడెక్కడం అనే రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు, వరదలు, కరువు పరిస్థితులు ఏర్పడడానికి సూచనలు కావొచ్చని నివేదికలు అంచనా వేస్తున్నాయి.

భారతదేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది

భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం దీర్ఘకాల సగటులో కేవలం 90 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించే ‘హిందూ మహాసముద్ర ద్విధ్రువం’ ఈసారి తటస్థంగా ఉందని.. అంటే, ఎల్ నినో సృష్టిస్తున్న నష్టాన్ని అడ్డుకునే ఎలాంటి సహజ పరిహార యంత్రాంగం ప్రస్తుతం మనకు అనుకూలంగా లేదని తెలిపింది. ఈ కారణంగా గత జూన్‌ నెలలో వర్షపాతం సాధారణం కంటే 40 శాతం తక్కువగా నమోదైందని.. గత 126 ఏళ్లలో ఇది దేశంలోనే 5వ అత్యంత తక్కువ వర్షపాతం జూన్‌లోనే నమోదైనట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!