AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలోని వారందరికి అదిరిపోయే శుభవార్త.. ఆగస్ట్ 7న కొత్త పథకం.. అకౌంట్లోరి రూ.25వేలు!

రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. నేతన్నలకు అండగా ఉండేందుకు మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి నేతతన్నకు రూ.25వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనుంది. మరి ఈ పథకానికి అర్హులు ఎవరో తెలుసుకుందాం పదండి.

ఏపీలోని వారందరికి అదిరిపోయే శుభవార్త.. ఆగస్ట్ 7న కొత్త పథకం.. అకౌంట్లోరి రూ.25వేలు!
Nethannaku Bharosa Scheme
Anand T
|

Updated on: Jul 16, 2026 | 7:03 AM

Share

రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. నేతన్నలకు అండగా ఉండేందుకు “నేతన్న భరోసా” అనే సరికొత్త పథకాన్ని తీసుకురాబోతుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 7వ తేదీని ఈ పథకాన్ని అధికారింకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి నేతన్నకు ప్రభుత్వం రూ.25 వేల చొప్పున ఆర్థిక సాహాయం అందజేయనుంది. ఈ పథకం కోసం ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం. అందుకే ఈ పథకాన్ని అమలు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది.

54వేల మందికి లబ్ధి

అయితే ఈ పథకాన్ని అర్హులు ఎవరు, ఎవరికి ఈ పథకం అమలు అవుతందనే విషయంపై చేనేత, జౌళిశాఖ ఇప్పటికే కస్తరత్తు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54వేల మంది అర్హులైన చేనేత కార్మికులు ఉన్నట్టు అంచనా వేసింది. అయితే కూటమి సర్కార్ ఎన్నిలకలో హామీ ఇవ్వనప్పటికి నేతన్నలకు ఆర్థిక భరోసా అందించేందుకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ సొంత మగ్గం ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

చేనేత అనుబంధ రంగాలు సైతం అర్హలే!

అయిగే గత ప్రభుత్వంలో చేనేత అనుబంధ రంగాలైన రాట్నం వడకడం, రంగులు అద్దడం వంటి వారికి ఎలాంటి సహాయం అందలేదు..ఈ పథకానికి సంబంధించి వారి నుంచి వినతులు రావడంతో ఇకపై వారికి కూడా పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ అనుబందం రంగాల్లో సుమారు 10వేల మంది వరకు అర్హులు ఉండొచ్చని అధికారులు అంచనావేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫైల్ ప్రభుత్వానికి చేరినప్పటికీ దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు.

నేతన్నలకు ఉచిత విద్యుత్

వీటితో పాటు నేతన్నలకు అండగా ఉండేందుకు ఇప్పటికే ప్రభుత్వం చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. అలాగే పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏటా సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేస్తోంది.దీని ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.8,640 ఆదా అవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us