AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: ధనాధిపతి అనుకూలత.. ఇక వీరికి జోబు నిండా డబ్బే డబ్బు..!

ధనాధిపతి అనుకూలంగా ఉన్నప్పుడు ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా క్రమంగా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్రస్తుత గ్రహ గోచారం ప్రకారం ఆరు రాశుల వారికి ధనాధిపతి బలంగా, అనుకూలంగా ఉన్నాడు. దీంతో ఇప్పటి నుంచి డిసెంబర్ చివరి వరకు వీరి ఆదాయం పెరగడం, కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి రావడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటి శుభ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవంటే?

Money Astrology: ధనాధిపతి అనుకూలత.. ఇక వీరికి జోబు నిండా డబ్బే డబ్బు..!
Money Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 28, 2026 | 4:40 PM

Share

ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, క్షీణించడం అన్నది ధనాధిపతి, అంటే ద్వితీయ స్థానాధిపతి స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. ఏ రాశుల వారికి ధనాధిపతి బలంగా ఉంటే ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనాధిపతి అనుకూలంగా ఉంటే తేలికగా ఆదాయం పెరుగుతుంది. ప్రస్తుత గోచారం ప్రకారం మేషం, కర్కాటకం, సింహం, కన్య, తుల, మకర రాశులకు ధనాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఇప్పటి నుంచి డిసెంబర్ చివరి వరకు ఈ రాశుల వారికి ఆదాయం క్రమంగా పెరుగుతూ, కొత్త ఆదాయ మార్గాలు అందివస్తూ, ఆర్థిక పరిస్థితి మెరుగైన స్థితికి చేరుకుంటుంది. ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

మేష రాశి

ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన శుక్రుడు జనవరి 2 వరకు తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి ఆదాయం బాగా పెరిగే అవ కాశం ఉంది. ఈ ఏడాదంతా వీరికి షేర్లు, స్పెక్యు లేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు ఉండే అవకాశంలేదు.

కర్కాటక రాశి

ఈ రాశికికి ధన, పంచమాధిపతులైన రవి, కుజుల మధ్య పరివర్తన జరగడంతో పాటు ధన స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారి ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. ఆర్థి కంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందడంతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. షేర్ల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయాన్ని మదుపు చేసి ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

సింహ రాశి

ఈ రాశికి ధనాధిపతి అయిన బుధుడు డిసెంబర్ 3 నుంచి చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తున్నందు వల్ల ఈ రాశివారికి నెలంతా ఆర్థిక పురోగతికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో పాటు, అద్దెలు, ఆస్తుల ద్వారా కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తుల విలువ బాగా పెరు గుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభ త్యాలు, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడ తాయి.

కన్యా రాశి

ఈ రాశికి ధన, భాగ్యాధిపతి అయిన శుక్రుడు జనవరి 2 వరకు ధన స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి ధన లాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో ధన వృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.

తులా రాశి

ఈ రాశికి ధనాధిపతి అయిన కుజుడు లాభ స్థానంలో ఉండడం, డిసెంబర్ 3 నుంచి ధన స్థానంలో భాగ్యాధిపతి బుధుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆదాయం దిన దినాభివృద్ది చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యానే కాక ప్రభుత్వ మూలకంగా కూడా ధన ప్రాప్తికి అవకాశం ఉంది. సామాన్యులు సైతం సంప న్నులు కావడం జరుగుతుంది. ఈ రాశివారు తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు.

మకర రాశి

ఈ రాశికి ధనాధిపతి అయిన శని తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. లాభ స్థానంలో రవి సంచారం వల్ల వివిధ మార్గాల్లో అపార ధన లాభం కలుగుతుంది. జీతభత్యాలు, అదనపు ఆదాయం, లాభాలు పెరగడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల, ఆస్తిపాస్తుల వల్ల బాగా లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి దక్కుతుంది.

Follow Us