AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT : ఓటీటీలో 400 కోట్ల సినిమా ప్రభంజనం.. వారంలోనే మిలియన్ వ్యూస్‏తో టాప్ ట్రెండింగ్..

ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. విడుదలైన వారం రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విధ్వంసం క్రియేట్ చేస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటివారంలోనే 1.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసుకుందామా.

Cinema OTT : ఓటీటీలో 400 కోట్ల సినిమా ప్రభంజనం.. వారంలోనే మిలియన్ వ్యూస్‏తో టాప్ ట్రెండింగ్..
Peddi Movie
Rajitha Chanti
|

Updated on: Jul 16, 2026 | 10:26 AM

Share

ఇటీవల బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. జూన్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో చరణ్ యాక్టింగ్, మెకోవర్ చూసి విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. అలాగే బుచ్చిబాబు మేకింగ్ పై ప్రశంసలు వచ్చాయి. అయితే ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించగా.. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికాగ స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం దక్షిణాది భాషలలో మాత్రమే ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే అటు థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. విడుదలైన వారం రోజుల్లోనే 1.9 మిలియన్ కు పైగా వ్యూస్ అందుకుని టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. దీంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

పెద్ది కథ విషయానికి వస్తే..

విజయనగరం జిల్లా సమీపంలోని, కొండల మధ్య ఉండే ఒక మారుమూల గిరిజన గ్రామానికి కనీస గుర్తింపు ఉండదు. ప్రభుత్వ రికార్డుల్లో కూడా లేని ఆ ఊరి ప్రజలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ఊరిని ఎలాగైనా రికార్డుల్లోకి తెచ్చి, అభివృద్ధి చేయాలనేది ఆ ఊరి పెద్ద అప్పలసూరి (జగపతిబాబు) ఆశయం. అదే ఊరిలో బెల్లం ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసే పెద్ది (రామ్ చరణ్) కి క్రికెట్ లో అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. తన ఊరి ఆత్మగౌరవం కోసం, దానికి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం పెద్ది తన ఆటను ఎలా ఆయుధంగా వాడుకున్నాడు? క్రికెట్ నుంచి ‘కుస్తీ’ వైపు ఎందుకు అడుగులు వేశాడు? ఒక మారుమూల గ్రామం నుంచి జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎలా ఎదిగాడు? అనేదే ఈ సినిమా కథ.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

Follow Us
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
రియాద్‌ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. ఇరాన్‌లో అమల్లోకి కోడ్ 100
రియాద్‌ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. ఇరాన్‌లో అమల్లోకి కోడ్ 100
అందరికి చుక్కలు చూపించిన నాగ్.. వీడియోస్ చూపించి మరీ ఊతికారేసాడు.
అందరికి చుక్కలు చూపించిన నాగ్.. వీడియోస్ చూపించి మరీ ఊతికారేసాడు.
ట్రైథ్లాన్ ఈవెంట్‌లో తొలి గోల్డ్ పట్టేసిన ఆతిథ్య దేశం..!
ట్రైథ్లాన్ ఈవెంట్‌లో తొలి గోల్డ్ పట్టేసిన ఆతిథ్య దేశం..!