అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డోనాల్డ్ ట్రంప్ చిత్రంతో కొత్త బంగారు నాణాన్ని యూఎస్ టంకశాల విడుదల చేసింది. దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ఈ వన్ డాలర్ నాణెం తొలి రూపాన్ని పంచుకున్నారు. అమెరికా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఈ చారిత్రక నాణెం ముద్రణ దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది.