హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ ప్రముఖ కార్ షోరూం కస్టమర్‌కు దెబ్బతిన్న కారును డెలివరీ చేసేందుకు ప్రయత్నించింది. కస్టమర్ డ్యామేజ్‌ను గుర్తించి, మరమ్మతు చేసిన కారును తిరస్కరించాడు. తనకు కొత్త కారు లేదా చెల్లించిన పది లక్షల రూపాయలు వాపస్ ఇవ్వాలని, ఆలస్యమైతే పెనాల్టీ చెల్లించాలని డిమాండ్ చేశాడు.