AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘అపరిచితుడు’ సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడు ఫేమస్ హీరో.. అతని బావ కూడా టాలీవుడ్‌లో తోపు హీరో

శంకర్ డైరెక్షన్ లో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన సినిమా అపరిచితుడు. సదా కథానాయిక. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇందులో విక్రమ్ చిన్నప్పటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్టు గుర్తున్నాడా?

Tollywood: 'అపరిచితుడు' సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడు ఫేమస్ హీరో.. అతని బావ కూడా టాలీవుడ్‌లో తోపు హీరో
Aparichithudu Movie
Basha Shek
|

Updated on: Sep 25, 2025 | 2:55 PM

Share

ఇప్పుడంటే శంకర్ సినిమాలు ఆడట్లేదు కానీ.. ఒకప్పుడు ఆయన సినిమాలకు క్రేజే వేరు. శంకర్ నుంచి సినిమా వచ్చిందంటే చాలు.. ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీసేవారు. జెంటిల్‌మేన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో.. ఇలా శంకర్ ఖాతాలో చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్యన శంకర్ తీసిన సినిమాలు సరిగా ఆడట్లేదు. స్నేహితుడు, రోబో 2, ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు ఆడియెన్స్ ను తీవ్రంగా నిరాశ పర్చాయి. అయితే గతంలో శంకర్ తీసిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో అపరిచితుడు ఒకటి. అవినీతి, లంచగొండితనం తెరకెక్కిన ఈ సినిమా న్నో సంచలనాలు సృష్టించింది. 2005లో రిలీజైన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించాడు. రాము, రెమో, అపరిచితుడు.. ఇలా మూడు డిఫరెంట్ రోల్స్‌లో అదరగొట్టేశాడు. అలాగే కథానాయికగా సదా ఆకట్టుకుంది. ప్రకాశ్ రాజ్, వివేక్, నాజర్, కళాభవన్ మణి, మనోబాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇక ఈ సినిమాలో విక్రమ్ చిన్నప్పటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్టు గుర్తున్నాడా? అతని పేరు విరాజ్. అ సలు పేరు హరి ప్రశాంత్. తండ్రి హెచ్‌ఎన్ సురేందర్ డబ్బింగ్ వాయిస్ ఆర్టిస్ట్. 2000 లో బియిలే మిహాలో సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత దీటుకుతే, అన్నే శరనాధేన్ వంటి చిత్రాల్లో కూడా బాలనటుడిగా మెప్పించాడు. అలా విక్రమ్ అపరిచితుడులోనూ చైల్డ్ ఆర్టిస్టు పాత్ర అంబిగా ఆకట్టుకున్నాడు. ఇక చెన్నై 600028 చిత్రంతో నటుడిగా కూడా అరంగేట్రం చేశాడు. ఆ మధ్యన అరుణ్ విజయ్ నటించిన మిషన్ చాప్టర్ 1 లోనూ ఓ కీలక పాత్రలో మెరిశాడు.

ఇవి కూడా చదవండి

అప్పటి ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు కోలీవుడ్ క్రేజీ హీరో విరాజ్..

Actor Viraj

Actor Viraj

అన్నట్లు విరాజ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతికి బావమరిది అవుతాడు. విరాజ్ తండ్రి సురేందర్ విజయ్ తల్లి శోభనా చంద్రశేఖర్ కు సోదరుడు అవుతాడు. అంటే ఆ లెక్కన విరాజ్ నటుడు విజయ్‌కి బావమరిది అన్నమాట. విజయ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటున్నాడు. అతను నటిస్తోన్న ఆఖరి సినిమా జననాయగన్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది . వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

దళపతి విజయ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Vijay (@actorvijay)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.