AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Swamy: ‘టాక్సిక్’ హీరో యశ్‌పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు.. అభిమానుల తీవ్ర ఆగ్రహం

కన్నడ స్టార్ హీరో యపై గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై రాఖీ భాయ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. వేణు స్వామి తమ హీరోకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Venu Swamy: 'టాక్సిక్' హీరో యశ్‌పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు.. అభిమానుల తీవ్ర ఆగ్రహం
Yash, Venu Swamy
Basha Shek
|

Updated on: Mar 14, 2026 | 4:04 PM

Share

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఎప్పుడూ ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకుంటుంటారు. తాజాగా ఆయన కన్నడ స్టార్ నటుడు, టాక్సిక్ హీరో యశ్‌ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని నెలల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు వేణు స్వామి. ఇదే సందర్భంగా హీరో యశ్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు వేణు స్వామి. ‘యశ్ అని ఒక హీరో ఉన్నాడు. ఇప్పుడు అతని పరిస్థితి చాలా కష్టంగా, భయంకరంగా ఉంది. అతరె కన్నడ హీరో కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను. అదే తెలుగు హీరో అయితే నేను మాట్లాడేవాడిని కాదు. మీరు నమ్మినా, నమ్మకపోయినా యశ్‌ ఇప్పుడు డిప్రెషన్‌లో ఉన్నాడు. ఎందుకంటే అతను చేసిన KGF సినిమాలు టాప్ లో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఆ లెవెవల్ సినిమా చేయడం కోసం అతను బాగా ఇబ్బంది పడుతున్నాడు. తన స్టార్ డమ్ ను నిలబెట్టుకోలేక యశ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు’ అని చెప్పుకొచ్చారు వేణు స్వామి. అయితే ఇది రెండు నెలల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూ. ఇప్పుడు కొందరు దీనిని బాగా వైరల్ చేస్తున్నారు. దీనిని చూసిన యశ్ అభిమానులు ఫైర్ అవుతన్నారు. తమ హీరోకు వేణు స్వామి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలవడం వేణు స్వామికి కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా మంది సెలబ్రిటీ ల పర్సనల్ లైఫ్ పై కామెంట్స్ చేసి ఇబ్బందుల్లో పడ్డారాయ. కొన్ని సంఘనల్లో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. మళ్లీ ఇప్పుడు టాక్సిక్ హీరో పై అనుచిత వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారారు వేణు స్వామి.

ఇవి కూడా చదవండి

కాగా యశ్ ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 19న విడుదల కావాల్సి ఉంది. అయితే ఇరాన్- అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఏకంగా జూన్ 04కు వాయిదా పడింది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీతో సహా ఏకంగ ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. టాక్సిక్ తో పాటు ‘రామాయణం’ సినిమాలోనూ రావణుడి పాత్రను యశ్ పోషిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us