AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jeevitha Rajasekhar: హీరో రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. వైరల్ వీడియోపై జీవిత ఏమన్నారంటే?

ఆ మధ్యన ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ అలీకి హైదరాబాద్ లో గాజుల ఫ్యాక్టరీ ఉందని నెట్టింట తెగ ప్రచారం జరిగింది. అలా హీరో రాజశేఖర్ కు కూడా గోటీల (గోళీలు) ఫ్యాక్టరీ ఉందని, అందులో జాబ్ మేళాలు కూడా జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి.

Jeevitha Rajasekhar: హీరో రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. వైరల్ వీడియోపై జీవిత ఏమన్నారంటే?
Jeevitha Rajasekhar
Basha Shek
|

Updated on: Mar 14, 2026 | 2:05 PM

Share

గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేశారు హీరో రాజశేఖర్. ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్టినరీ మ్యాన్ లో ఓ కీలక పాత్రలో కనిపించిన ఆయన ఇప్పుడు శర్వానంద్ బైకర్ లోనూ ఓ కీ రోల్ చేస్తున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. రాజశేఖర్ కు సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక విచిత్రమైన వార్త తెగ వైరలవుతోంది. హీరో రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందని, అందులో పనిచేసే ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్).. ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా సరే రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ఫోటోలు, వీడియోలే కనిపించాయి. సినిమా అవకాశాలు లేక డాక్టర్ రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ పెట్టారని.. దీని ద్వారా కోట్లు సంపాదిస్తున్నారని, ఈ ఫ్యాక్టరీ లో పనిచేసి ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారు అంటూ నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా ఈ వైరల్ వీడియోలు, వార్తలపై రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ స్పందించింది. ఇటీవల ఒక సినిమా ఈవెంట్ కు హాజరైన ఆమె రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ వార్తలపై స్పందించింది. రాజశేఖర్ పేరుతో తమకు ఎలాంటి గోటీల ఫ్యాక్టరీ లేదని అదంతా ఫేక్ న్యూస్ మాత్రమే అంటూ కొట్టి పారేసింది.

‘అసలు ఆ గోటీల ఫ్యాక్టరీలు ఏంటో? ఎవరు? ఎందుకు ఇలా పోస్టులు షేర్ చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. నేను, మా ఆయన, మా పిల్లలు అవి చూసి నవ్వుకుంటున్నాం. ఈ మధ్య సోషల్ మీడియా కూడా ఫేక్ గా మారిపోతోంది. అందులో ఏమైనా నెగెటివిటీ విమర్శలు వచ్చాయి అంటే దాన్ని చూసి బాధపడాలా లేదా అనే ఆలోచన ఎవరికీ లేదు. ఏది నిజమో? ఏది అబద్దమో కూడా తెలుసుకోలేకపోతున్నాం. రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అంటూ వస్తున్న ఫేక్ ప్రచారం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇందులో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని విన్నాను. అలాంటివి జరుగుతుండడం చాలా బాధాకరం. దయచేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇలాంటి పోస్టులను ఎవరు కూడా నమ్మకండి . మీకు పూర్తిగా దానిపై అవగాహన వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి ఆరా తీయండి. ఎందుకంటే ఈ మధ్య న ప్రతీది ఫేక్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా అది ఫేక్ అని మేము వెళ్లి చెప్పలేం కదా. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని జీవిత చెప్పుకొచ్చింది. మొత్తానికి రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అంతా కల్పితమే నని ఫుల్ క్లారిటీ ఇచ్చింది జీవిత.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ పేరుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా..? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి
మీ పేరుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా..? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!