AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

కొద్ది రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు దుమ్మురేపుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో రికార్డు స్ట్రీమింగ్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఐఎమ్ డీబీలోనూ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు టాప్ రేటింగ్ దక్కడం గమనార్హం.

OTT Movie: 300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 12, 2026 | 9:18 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. అయితే గత వారం, అంతకు ముందు వారం ఓటీటీలో రిలీజైన కొన్ని సినిమాలు ఇప్పటికీ టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. రికార్డు స్ట్రీమింగ్ మినిట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఓటీటీలో అదరగొడుతోంది. ఫిబ్రవరి 27న ఓటీటీలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు మార్చి 5 వరకు సుమారు 300.3 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ వచ్చాయి. అంటే ఈ మధ్యకాలంలో ఓటీటీలో అత్యధిక మంచి చూసిన ఒరిజినల్ ఫిల్మ్ ఇదేనన్నమాట. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 19వ శతాబ్దపు కరేబియన్ దీవుల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. ఇందులో అర్సెల్ అలియాస్ బ్లడీ మేరీ అనే ఒకామె తన పాత జీవితాన్ని వదిలేసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటుంది. పిల్లలతో లైఫ్ లీడ్ చేస్తుంటుంది. అయితే ఆమె జీవితంలోకి తన పాత శత్రువు కెప్టెన్ కానర్ రూపంలో ఎంటర్ అవుతాడు. దీంతో తన ఫ్యామిలీకి రక్షించుకోవడానికి అర్సెల్ మళ్లీ కత్తి పట్టాల్సి వచ్చింది. తన బిడ్డను రక్షించేందుకు యోధురాలిగా మారుతుంది.

ప్రస్తుతం ఇంగ్లిష్ తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా పేరు ది బ్లఫ్. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ మూవీలో మెయిన్ లీడ్ పోషించింది. హాలీవుడ్ స్టార్ కార్ల్ అర్బన్ మరో కీలక పాత్రలో మెరిశాడు. కరేబియన్ పైరేట్స్ నేపథ్యంలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ప్రియాంక చోప్రా ‘బ్లడీ మేరీ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె నటనకు రాజమౌళి, మహేష్ బాబు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లిపోతోంది. మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ది బ్లఫ్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

టాప్ ప్లేస్ లో ప్రియాంక సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us