ఆ హీరో యాక్టింగ్ అంటే పిచ్చి ఇష్టం.. కీర్తికి ఇష్టమైన స్టార్ ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

17 October 2026

దక్షిణాది చిత్రసీమలో తన నటనతో, గ్లామర్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి కీర్తి సురేష్). 'మహానటి' చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.

నేటితరం హీరోయిన్లలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్, తనకిష్టమైన నటుడి గురించి చెప్పుకొచ్చింది.

తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో ఎందరో అగ్ర హీరోలతో కలిసి నటించిన కీర్తి సురేష్‌ను, మీకు అత్యంత ఇష్టమైన నటుడు ఎవరు అని ప్రశ్నించగా.. కీర్తి రియాక్ట్ అయ్యింది.

ఆమె ఏమాత్రం సంకోచించకుండా వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి పేరును వెల్లడించింది. విజయ్ సేతుపతి యాక్టింగ్ స్టైల్, ఆయన ఎంచుకునే విలక్షణమైన పాత్రలు ఇష్టమని అన్నారు.

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఆయన నటన తనకు ఎంతో ఇష్టమని పేర్కొంది. విజయ్ సేతుపతి హీరోగానే కాకుండా విలన్‌గా, సహాయ నటుడిగా ఏ పాత్ర చేసినా దానికి పూర్తి న్యాయం చేస్తారని

అందుకే ఆయన తనకు ఆల్‌టైమ్ ఫేవరెట్ అని చెప్పుకొచ్చింది. మక్కల్ సెల్వన్ గా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న విజయ్ నటనపై కీర్తి అభిప్రాయం పంచుకుంది.

దీంతో అభిమానులు కూడా వీరిద్దరి కాంబినేషన్ రాబోయే రోజుల్లో వెండితెరపై వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తుంది.

చేతిలో నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగుతోపాటు తమిళంలోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న కీర్తి బర్త్ డే (అక్టోబర్ 17)