AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanmukh Jaswanth: షణ్ముఖ్ చేతిపై చెరగని దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదో తెలుసా?

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ త్వరలోనే తన కొత్త జీవితంలో ఒక సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. వైష్ణవి అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. ఇటీవలే వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది.

Shanmukh Jaswanth: షణ్ముఖ్ చేతిపై చెరగని దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదో తెలుసా?
Shanmukh Jaswanth
Basha Shek
|

Updated on: Mar 12, 2026 | 9:53 PM

Share

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యూట్యూబర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అతను వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే ఇమేజ్ తో బిగ్ బాస్ లోనూ అడుగు పెట్టాడు షణ్ముఖ్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న షన్నూ తన ఆట, మాట తీరుతో రన్నరప్ గా నిలిచాడు. అయితే ఈ బిగ్ బాస్ షో ద్వారా ఎంత ఫేమ్ సంపాదించుకున్నాడో అంతే నెగెటివిటీని మూటగట్టుకున్నాడు. ఈ షోలో ఎంటర్ అయ్యేటప్పటికే దీప్తి సునయన తో ప్రేమలో ఉన్నాడు షన్నూ. కానీ బిగ్ బాస్ హౌస్ లో సిరి హనుమంత్ తో అతను ప్రవర్తించిన తీరు చాలా మందికి వెగటు పుట్టించింది. ఈ కారణంగానే ఒకానొకదశలో బిగ్ బాస్ విన్నర్ అవుతాడనుకున్న షణ్ముఖ్ కేవలం రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత దీప్తి తోనూ షన్నూకు బ్రేకప్ అయ్యింది.

ఇక బ్రేకప్ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు షన్నూ, దీప్తి. ఈ క్రమంలోనే తాజాగా షణ్ముఖ్ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాను అని ప్రకటించారు. ఇందులో భాగంగానే వైష్ణవి అనే అమ్మాయతో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న షన్నూ తన చేతిపై ఉన్న దీప టాటూ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. దీప్తితో బ్రేకప్ అయినప్పటికీ ఆమె టాటూను అలాగే ఉంచుకోవడం, దీనిని చూసి కాబోయే భార్య వైష్ణవి ఎలా స్పందించిందన్న ప్రశ్నకు షన్నూ ఇలా ఆన్సర్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

వైష్ణవితో షణ్మఖ్ జస్వంత్..

‘పెళ్లి తర్వాత ఈ టాటూ రిమూవ్ చేద్దామని అనుకున్నాను . కానీ నా కాబోయే భార్య వైష్ణవి..” అది మీ మెమొరీ కదండీ.. అది మీ ఇష్టం.. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయండి. నేనైతే దాని గురించి ఏం చెప్పను.. నేను మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను అంటూ చెప్పింది ” అని తన భార్య వైష్ణవి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు షన్నూ. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. షణ్ముఖ్ కు చాలా మంచి గా అర్థం చేసుకునే భార్య దొరికిందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డిమాన్ గొడవపై రీతూ చౌదరీ పోస్ట్..
డిమాన్ గొడవపై రీతూ చౌదరీ పోస్ట్..
చికెన్ కడిగేటప్పుడు పసుపు ఎందుకు కలుపుతారో తెలుసా? కారణాలు ఇవే!
చికెన్ కడిగేటప్పుడు పసుపు ఎందుకు కలుపుతారో తెలుసా? కారణాలు ఇవే!
అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..
అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన