AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు.. అదృష్టం ఉండాలి

నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు.. అదృష్టం ఉండాలి

Phani CH
|

Updated on: Mar 14, 2026 | 12:55 PM

Share

పుణేకు చెందిన 75 ఏళ్ల సుభాశ్ గుగ్లే తన నానో కారులో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు. వయసు మళ్ళినా, రోజుకు 8 గంటలు డ్రైవ్ చేస్తూ, దక్షిణ భారతం నుండి సిక్కిం వరకు ఎన్నో రాష్ట్రాలను సందర్శించారు. భారతీయ సంస్కృతి, వైవిధ్యాన్ని దగ్గర నుండి చూస్తున్న గుగ్లే, ప్రయాణమే తన మందు అంటారు. యువత విదేశాలపై కాకుండా దేశ పర్యటనలపై దృష్టి సారించి, దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలని పిలుపునిస్తున్నారు.

సాధారణంగా కాస్త వయసు పైబడగానే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. కానీ పుణేకు చెందిన సుభాశ్ గుగ్లే మాత్రం 75 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా రోజుకు 8 గంటలు స్వయంగా నానో కారును నడుపుతూ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పింపరీ చించవడ్ నగరానికి చెందిన సుభాశ్ గుగ్లే ఇప్పటివరకు దక్షిణ భారత్​లోని పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటించారు. అలాగే సిక్కిం, పంజాబ్​ వరకు కూడా నానో కారులోనే ప్రయాణించారు. రాజస్థాన్, గుజరాత్​ రాష్ట్రాలను సందర్శించారు. ఇటీవల తన భార్య మంగళా గుగ్లేతో కలిసి పుదుచ్చేరి ప్రయాణాన్ని పూర్తి చేశారు. చిన్నప్పుడు తన తండ్రి గుర్రంపై కూర్చోబెట్టి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లేవారని ఆ అనుభవాలే తనలో పర్యటనపై ఆసక్తిని పెంచాయని అన్నారు. కొంతకాలం క్రితం అహ్మద్‌నగర్ నుంచి షిరిడీ వరకు చేసిన సైకిల్‌ ప్రయాణం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనీ తర్వాత టూవీలర్‌తో చిన్న చిన్న పర్యటనలు చేసూ తన ఆసక్తిని కొనసాగించాననీ ఆయన అన్నారు. ప్రయాణం తనకు మందు లాంటిదని సుభాష్‌ అంటారు. అనారోగ్యం లేదా మనసు బరువుగా ఉన్నప్పుడు మందులు తీసుకోవడం కన్నా ప్రయాణం చేయడానికే ఇష్టపడతానని తెలిపారు. ఇప్పటి యువత విదేశాల్లో పర్యటించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారని, సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్‌ చేయడంపై ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపుతారని సుభాశ్ గుగ్లే అంటున్నారు. కానీ భారత్‌లో ఎన్నో అందమైన, వైవిధ్య ప్రదేశాలు ఉన్నాయని, జీవితమంతా తిరిగినా వాటిని పూర్తిగా చూడటం కష్టమని చెప్పారు. విదేశాలకు వెళ్లడానికి ఖర్చు చేసే డబ్బుతోనే భారత్‌లో పర్యటిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని గుగ్లే అంటున్నారు. ప్రయాణాలు వల్ల కేవలం ప్రకృతిని చూడటమే కాకుండా వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకునే అవకాశం వస్తుందని ఆయన చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి

ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. ఇకపై వారు ‘డేటా ట్యాక్స్’ కట్టాల్సిందే !

Hyderabad: హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!

Follow Us