ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..
ఈ కథనం ఒక టెకీ, స్టార్టప్ యజమాని మధ్య జరిగిన ఆసక్తికర సంఘటనను వివరిస్తుంది. ₹28 లక్షల ప్యాకేజీకి ఒప్పుకున్న టెకీ, జాయినింగ్ తేదీకి రెండు రోజుల ముందు ₹36 లక్షలు డిమాండ్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది, ఐటీ రంగంలో నియామకాల అస్థిరతను, స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టం చేస్తుంది. వృత్తి నైపుణ్యం, మార్కెట్ పోటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ‘ప్యాకేజీ’ల డిమాండ్ ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్పే ఘటనే ఇది. తన కంపెనీలో చేరతానని మాట ఇచ్చిన ఒక టెకీ.. తీరా జాయినింగ్ తేదీకి రెండు రోజుల ముందు ఊహించని మెలిక పెట్టడంతో ఒక స్టార్టప్ యజమాని ఇరిటేషన్‌కు గురయ్యారు. ఆ విషయాన్ని పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగ నియామక ఇంటర్వ్యూకు హాజరైన ఓ టెకీకి ఒక స్టార్టప్ కంపెనీ రూ.28 లక్షల వార్షిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసింది. పాత కంపెనీలో అతడు పొందుతున్న రూ.21 లక్షల ప్యాకేజీకి దాదాపు 33 శాతం హైక్ ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ ఆఫర్ నచ్చడంతో ఆ టెకీ దీనికి ఓకే చెప్పేశాడు. అయితే, నోటీస్ పీరియడ్ కారణంగా జాయినింగ్ కు సమయం కోరటంతో కంపెనీ కూడా సరేనని ఆఫర్ లెటర్ ఇచ్చింది. అయితే, జాయినింగ్ డేట్‌కి రెండు రోజుల ముందు, ఆ టెకీ మళ్ళీ కంపెనీని సంప్రదించాడు. తనకు మరో కంపెనీలో రూ.31 లక్షల ప్యాకేజీ ఆఫర్ వచ్చిందని చెబుతూ.. ఇంటర్వ్యూలో తాను అంగీకరించిన రూ.28 లక్షల ప్యాకేజీని రూ.36 లక్షలు చేస్తేనే ఉద్యోగంలో చేరుతానని మెలిక పెట్టాడు. ఈ పరిణామంతో స్టార్టప్ కంపెనీ ఫౌండర్ అయోమయంలో పడ్డారు. ‘‘ముందే అంగీకరించి చివరి నిమిషంలో ఇలాంటి డిమాండ్లు పెట్టడం ఏంటి? దీనివల్ల ప్రాజెక్టుల సమయం వృధా అవ్వడమే కాకుండా కంపెనీ బ్రాండ్ దెబ్బతింటుంది’’ అని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ముందు ఒప్పుకున్నాక ఇప్పుడు జీతం పెంచితేనే వస్తానని అనడం ఏంటని ప్రశ్నించారు. జీతం విషయంలో బేరసారాలు తప్పని తాను అనడంలేదని, అయితే అదంతా ఆఫర్ ఒప్పుకోవడానికి ముందే చేయాలని అన్నారు. తమకు కావాల్సిన ఉద్యోగి దొరికాడని ఇంటర్వ్యూలు కూడా ఆపేశామని తెలిపారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. ‘‘ఇది ముమ్మాటికీ ప్రొఫెషనలిజం కాదు, చివరి నిమిషంలో బ్లాక్ మెయిల్ చేయడమే’’ అని కొందరు యజమానికి మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం ‘‘మార్కెట్‌లో పోటీ ఎక్కువగా ఉంది, ఎక్కువ జీతం వచ్చే చోటికి వెళ్లడంలో తప్పులేదు’’ అని కొందరు టెక్కీని వెనకేసుకొచ్చారు. మొత్తానికి ప్రస్తుత ఐటీ మార్కెట్‌లో ‘ఆఫర్ లెటర్లు’ ఇచ్చినా ..ఉద్యోగి జాయిన్ అయ్యే వరకు నమ్మకంలేని పరిస్థితి ఏర్పడిందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు
నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు.. అదృష్టం ఉండాలి
సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి
ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. ఇకపై వారు ‘డేటా ట్యాక్స్’ కట్టాల్సిందే !
Hyderabad: హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్ !!
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్
రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు
నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు
హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్ !!
గ్యాస్ సెగ.. మళ్లీ లాక్డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి

