AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baahubali : ఎంత పని చేశావ్ అమ్మడు.. స్వీటీకి ఛాన్స్ ఇచ్చిన ముద్దుగుమ్మ.. బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. అరుంధతి సినిమాతో లేడీ సూపర్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే అనుష్క నటించిన బాహుబలి సినిమాను మిస్సైన అమ్మడు ఎవరో తెలుసా.. ?

Baahubali : ఎంత పని చేశావ్ అమ్మడు.. స్వీటీకి ఛాన్స్ ఇచ్చిన ముద్దుగుమ్మ.. బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
Anushka Shetty
Rajitha Chanti
|

Updated on: Mar 14, 2026 | 3:09 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో తనదైన ముద్ర వేసింది హీరోయిన్ అనుష్క శెట్టి. అటు గ్లామర్, ఇటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ మరింత క్రేజ్ సంపాదించుకుంది. సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ అరుంధతి సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ జేజమ్మ పాత్రలో తదనైన నటనటో ఆకట్టుకుంది. తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా ప్రభాస్, అనుష్క పెయిర్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన మిర్చి, బాహుబలి 1, 2 చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా అనుష్క కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

ఈ సినిమా తర్వాత సినిమాలు తగ్గించింది అనుష్క. భాగమతి, నిశ్శబ్దం వంటి చిత్రాలతో నటిగా మంచి హిట్స్ అందుకుంది. చివరగా ఘాటి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం అటు సినిమాలకు, ఇటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. అనుష్క కెరీర్ మలుపు తిప్పిన ఈ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ నయన్ అని.. కానీ ఆ ప్రాజెక్ట్ ఆమె రిజెక్ట్ చేసిందంటూ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

నయనతార బాహుబలి ఫ్రాంచైజీ చిత్రాలు చేసి ఉంటే ఆమె స్థాయిలో మరో లెవల్ కు వెళ్లి ఉండేది అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికీ నయన్ క్రేజ్ మాములుగా ఉండదు. బాహుబలి సినిమాను మిస్సైనప్పటికీ జవాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవలే మన శంకరవర ప్రసాద్ గారు సినిమాతో హిట్టు అందుకుంది నయన్.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

Anushka Shetty

Anushka Shetty

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us