AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage Astrology: గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి పెళ్లి యోగాలు..!

ప్రస్తుతం గురు, శుక్రులు మిథున, మీన రాశుల్లో సంచారం చేస్తున్నందువల్ల, ప్రస్తుత సమయం పెళ్లి ప్రయత్నాలకు, పెళ్లిళ్లకు అనుకూలంగా ఉంది. వచ్చే రెండు మూడు నెలల కాలంలో కొన్ని రాశుల వారికి పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి, పెళ్లి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రకరకాలుగా పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఏ రాశివారికి ఎటువంటి సంబంధం కుదురుతుందన్నది ఆసక్తికరమైన విషయం. ప్రస్తుత గ్రహ సంచారం వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి పెళ్లి విషయంలో సమయం బాగా అనుకూలంగా ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 14, 2026 | 2:06 PM

Share
మేషం: ఈ రాశికి సప్తమ స్థానాన్ని గురువు వీక్షించడం, సప్తమ స్థానాధిపతి శుక్రుడు ఉచ్ఛపట్టి ఉండడం వల్ల ఈ రాశివారికి త్వరలో వివాహ యోగం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాలకు ఇది బాగా అనుకూలమైన సమయం. శుక్రుడు వ్యయ స్థానంలో ఉచ్ఛపట్టడంవల్ల వీరికి సాధారణంగా విదేశీ సంబంధమే కుదిరే అవకాశం ఉంది. స్వదేశీ సంబంధాల కంటే ఎక్కువగా విదేశీ సంబంధాలనే ప్రయత్నించడం మంచిది. బాగా సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయమయ్యే అవకాశం ఉంది.

1 / 6
వృషభం: ఈ రాశికి కుటుంబ స్థానంలో గురు సంచారం, కళత్ర కారకుడైన శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఈ రాశివారికి అతి సమీప భవిష్యత్తులో తప్పకుండా వివాహ జరిగే యోగం ఉంది. సాధారణంగా సంపన్న కుటుంబానికి చెందిన స్వదేశీ సంబంధమే అయ్యే సూచనలు న్నాయి. స్వదేశంలోనే ఎక్కువగా సంబంధాలకు ప్రయత్నించడం వల్ల ఉపయోగం ఉంటుంది. మే నెలలో పెళ్లి జరిగే అవకాశం ఉంది. పెళ్లి  బాగా వైభవంగా, ఆడంబరంగా జరిగే సూచనలున్నాయి.

2 / 6
మిథునం: ఈ రాశిలో గురువు, దశమంలో ఉచ్ఛస్థితిలో శుక్రుడు సంచారం సాగించడం వల్ల సమీప భవిష్యత్తులో పెళ్లి యోగం ఉంది. చిన్న ప్రయత్నంతో సంబంధం కుదురుతుంది. ఈ రాశివారికి సహోద్యోగితో లేదా పరిచయస్థులో పెళ్లి కుదరడానికే అవకాశం ఉంది. ఎక్కువగా స్థానికంగానే సంబంధాలను ప్రయత్నించడమే మంచిది. ఇష్టపడిన వ్యక్తితో గానీ, ప్రేమించిన వ్యక్తితో గానీ పెళ్లి జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సాధారణంగా ఈ రాశివారికి మే-జూలై మధ్య పెళ్లి జరగవచ్చు.

3 / 6
తుల: ఈ రాశివారికి భాగ్య స్థానంలో గురువు, శుక్రుడి ఉచ్ఛ స్థితి వల్ల ఒకటి రెండు నెలల్లో తప్పకుండా వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయత్నంతో బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంపన్న వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండవచ్చు. స్వదేశీ సంబంధాలకన్నా విదేశాల్లో స్థిరపడిన బంధువుల సంబంధాలకు ఎక్కువ అవకాశాలున్నాయి. వివాహం సంప్రదాయబద్ధంగా జరిగే అవకాశం ఉంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో, అంటే వివాహ స్థానంలో, గురువు సంచారం, చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితి శుక్రుడి సంచారం వల్ల వివాహానికి సమయం ఆసన్నమైనట్టే భావించవచ్చు. సాధారణంగా స్వదేశీ సంబంధమే ఖాయం కావచ్చు. స్వదేశీ సంబంధాల మీదే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల ఉపయోగముంటుంది. ప్రేమించిన వ్యక్తితో గానీ, పరిచయస్థులతో గానీ పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. వివాహం సంప్రదాయబద్ధంగా, బాగా ఆడంబరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

5 / 6
కుంభం: ఈ రాశికి కుటుంబ స్థానంలో శుక్రుడి ఉచ్ఛస్థితి, పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి ఈ మే ప్రాంతంలో వివాహ యోగం కలుగుతుంది. భారీ ఖర్చుతో వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇష్టపడిన వ్యక్తితో సంబంధం ఖాయమయ్యే సూచనలున్నాయి. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదిరిపోతుంది. విదేశీ సంబంధాల కన్నా స్వదేశీ సంబంధం కుదరడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉంటారు.

6 / 6
Follow Us