AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ బండకి దండ, బొట్లు, హారతి ఇచ్చి.. ఆ మహిళ చేసిన పనికి అందరూ షాక్!

గ్యాస్ బండ పక్కన ఓ మహిళా కూర్చొని దేవుడికి పూజ చేస్తున్నట్లు కూరగాయలను పెట్టి, దండ, పూలు పెట్టి హారతి ఇస్తూ మంత్రాలు కూడా చదివింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంకా ఆమె ఏం చేసిందో ఇక్కడ చదివి తెలుకోండి.

గ్యాస్ బండకి దండ, బొట్లు, హారతి ఇచ్చి.. ఆ మహిళ చేసిన పనికి అందరూ షాక్!
Gas Viral
Prasanna Yadla
|

Updated on: Mar 14, 2026 | 3:44 PM

Share

ఊరు ఏదైనా దేశంలో ఒక్కటే మాట వినిపిస్తుంది. మా ఇంట్లో గ్యాస్ అయిపొయింది. దయచేసి గ్యాస్ బండను ఇప్పించగలరు అని. ఎక్కడా చూసిన ఇది తప్ప ఇంకోటి కనపడటం లేదు. ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే గ్యాస్ కొరత వల్ల ఆహారాలు వండటం కూడా మానేశారు. ఇక పట్టణాల్లో గ్యాస్ మీదే ఆధారపడి బతుకున్న వాళ్ళు వామ్మో ఇలా అయితే మా జీవనం ఎలా సాగించాలంటూ లబో దిబో అంటున్నారు. కొన్ని హాస్టల్లో టిఫిన్ కూడా పెట్టడం లేదు. ఇప్పుడే ఇలా ఉదంటే ముందు ముందు ఇంకెన్ని చూడాలో బాబోయ్ అంటూ సామాన్యులు కూడా భయపడుతున్నారు. ఈ సమయంలోనే కొందరు సోషల్ మీడియాలో గ్యాస్ సిలిండర్ తో వీడియోలు చేస్తున్నారు.

రోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటాయి, మరి కొన్ని షాకింగ్ లా ఉంటాయి. ఈ వీడియోలో ఓ మహిళా గ్యాస్ బండను దేవత లాగా మార్చేసింది. మీరు ఈ వీడియో చూస్తే నమ్మలేకుండా అస్సలు ఉండలేరు. దేవతగా మార్చడమే కాకుండా పక్కన కూర్చొని పూజలు చేయడం కూడా మొదలు పెట్టింది.

గ్యాస్ బండ పక్కన కూర్చొని ఓ మహిళా కూరగాయలను పెట్టి, దండ, పూలు పెట్టి హారతి ఇస్తూ మంత్రాలు కూడా చదివింది. అంటే, ఇప్పుడు అందరికి గ్యాస్ దేవుడు, దేవత లాగా అయిపోయింది. కొనుక్కుందామన్నా కూడా కొందరికి అస్సలు దొరకడం లేదు. ఆ మహిళా ఆ ఉద్దేశంతోనే ఈ వీడియోను చేసి ఉంటుంది. బీరకాయలు, పచ్చి మిర్చి , వంకాయలు, క్యారెట్, బీన్స్ బంతి పూలు, చామంతి పూలు, గులాబీ పూలు ఇలా పెట్టి సాంబ్రన్ పుల్లలతో మూడు సార్లు హారతి ఇచ్చి పాటలు కూడా పాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో తక్కువ సమయంలోనే బాగా వైరల్ అయింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్లతో ఇన్ బాక్స్ ను నింపేశారు. ఓ అక్కా ఏ ఊరు మనది ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది అక్కా మాకు కూడా కొద్దిగా చెప్పవా.. అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Ganga Ranga (@gangaranga7)

Follow Us