AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు.. అల్లు అర్హ ఏం చేసిందో తెలుసా?

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే స్టార్ కిడ్ గా తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదంచుకుందీ గారాల పట్టి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అల్లు అర్హ ఫొటోలు, వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Allu Arjun: నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు.. అల్లు అర్హ  ఏం చేసిందో తెలుసా?
Allu Arjun Daughter Allu Arha
Basha Shek
|

Updated on: Mar 14, 2026 | 2:55 PM

Share

అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకెళ్లిపోతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ. మరోవైపు ఆయన కూతురు అల్లు అర్హ కూడా తన ట్యాలెంట్ తో రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. అల్లు అర్హ ఇప్పటికే సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. సమంత నటించిన పాన్ ఇండియా మూవీ శాకుంతలంలో అర్హ ఓ కీలక పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమా ఫ్లాపైనా అల్లు అర్హ క్యూట్ యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. ఇక చదువులోనూ అదరగొడుతోన్న ఈ స్టార్ కిడ్ తన ట్యాలెంట్ తోనూ వరల్డ్ రికార్డులు కొల్లగొడుతోంది. శనివారం (మార్చి 14) అల్లు అర్హ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ అభిమానులు, నెటిజన్లు ఈ స్టార్ కిడ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే కేవలం నాలుగేళ్ల వయసులోనే ఏకంగా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించింది అర్హ. ఇంత చిన్న వయసులో అర్హ కేవలం చెస్ ఆడడమే కాకుండా ఎంతో మందికి ట్రైనింగ్ కూడా ఇస్తోందట.

హైదరాబాదులోని హైటెక్ సిటీకి చెందిన రాయ్ చెస్ అకాడమీలో అల్లు అర్హ శిక్షణ తీసుకుందట. అంతేకాదు రెండు నెలల్లోనే సుమారుగా 50 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చిందట. ఈ క్రమంలో చెస్ లో అల్లు అర్హ ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధి ఆర్బిటర్ లింగం బాలాజీ పర్యవేక్షణలో అర్హకు చెస్ లో నైపుణ్య పరీక్ష నిర్వహించగా, అందులో ఆమె టాప్ లో నిలిచిందట. ఈ క్రమంలోనే నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆమెకు వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్ అవార్డును అందించింది. తల్లిదండ్రులైన అల్లు అర్జున్, అల్లు స్నేహా రెడ్డి సమక్షంలో అర్హ ఈ అవార్డును అందుకుందట. ఇందకు సంబంధించిన ఫొటోల, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఆమె పుట్టినరోజు సందర్భంగా బన్నీ అభిమానులు అల్లు అర్హ అని హ్యష్ ట్యాగ్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అల్లు అర్హకు శుభాకాంక్షల వెల్లువ..

అల్లు అర్హ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us