AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది గిఫ్ట్‌ అంటే ఇది కదా.. సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్

రాష్ట్రంలోని నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం ఉగాది పండగకు ముందుగానే అదిరిపోయే శుభవార్త చెప్పనుంది. తెలుగు కొత్త సంవత్సరం ఉగాలి సందర్భంగా సొంతిల్లు కట్టుకోవాలని అనే పేదల కలను చంద్రన్న సర్కార్ నెరవేర్చబోతుంది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేటకు సమీపంలో బిరదవాడ వద్ద నిర్మించిన 2,064 ఇళ్లను ఈ నెల 17 సీఎం చంద్రబాబు చేతుల మీదగా ప్రారంభించనున్నారు.

ఉగాది గిఫ్ట్‌ అంటే ఇది కదా.. సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్
Ap Tidco Houses Inauguration
Anand T
|

Updated on: Mar 14, 2026 | 4:40 PM

Share

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది. ఇందులొ భాగంగానే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను మొదటు పెట్టింది. ప్రజలకు చెప్పినట్టుగానే ఉగాది నాటికి ఈ ఇళ్లను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చి.. ప్రజలకు అందించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే అక్కడ పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసింది ప్రభుత్వం. తిరుపతి జిల్లాలోని నాయుడుపేటకు సమీపంలో బిరదవాడ వద్ద నెషనల్ హైవే 16 పక్కన 36 ఎకరాల విస్తీర్ణంలో రూ.168 కోట్లతో 2,064 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన ప్రభుత్వం ప్రస్తుతం సకల వసతులతో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉగాదికి ముందు ఈ నెల 17న సీఎం చేతుల మీదగా ఈ ఇళ్లను ప్రారంభించనుంది.

అయితే గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెవర్చేందుకు నాయుడుపేట పురపాలక సంఘం బిరదవాడలో 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో 2064 టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను చేపట్టింది. దాదాపు 70 శాతం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. అప్పుడే సరిగ్గా ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో వాటి నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచి పోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వీటి నిర్మాణ పనులు పూర్తి చేయలేదు.

తాజాగా మళ్లీ బీజేపీ, జనసేన కూటమిగా కలిసి అధికారంలో వచ్చిన టీడీపీ ప్రభుత్వం నిలిచిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని మళ్లీ చేపట్టింది. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసి ఆ ఇళ్లను సుందరంగా తీర్చి దిద్దింది. ఇక ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఈ నెల 17న సీఎం చంద్రబాబు చేతుల మీదగా వాటిని ప్రారంభించనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది