AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: రంగంలోకి మరో అల్పపీడనం.. ఇవాళ భారీ వర్షాలు కురిసేది ఈ జిల్లాల్లోనే!

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Weather Report: రంగంలోకి మరో అల్పపీడనం.. ఇవాళ భారీ వర్షాలు కురిసేది ఈ జిల్లాల్లోనే!
Ap And Telangana Latest Weather Report
Anand T
|

Updated on: Aug 12, 2026 | 7:08 AM

Share

ఏపీ, తెలంగాణ ప్రజలకు ఆయా రాష్ట్రాల వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేశాయి. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని.. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. అల్పపీడన ప్రభావంతో నేడు( బుధవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

అలాగే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే మత్స్యారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

తెలంగాణలో వాతావరణం ఇలా

ఇటు తెలంగాణకు కూడా వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. గత రెండ్రోజులుగా ఉక్కపోత వాతావరణంతో ఇబ్బంది పడిన ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. నేడు ( బుధవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడడక్కడ తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్‌ సహా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, మహబూబాబాద్, నల్గొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వర్షాల పట్ల అప్రమ్తతత

ఈ వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కొన్ని సూచనలు చేసింది. వర్షాలు కురిసే సమయంలో చెట్లకిందకాని, సైన్ బోర్డు, హోర్డింగ్స్ కింద నిల్చోవద్దని తెలిపింది. అలాగే తీరాప్రాంతాల్లోని ప్రజలు సముద్రంలోకి వెళ్లరాదని సూచించింది. పోలాలకే వెళ్లే రైతులకు జాగ్రత్తగా ఉండాలని.. భారీ ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ తీగలు తెగ పడే ఛాన్స్ ఉందని.. అలా ఎక్కడైనే గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రేదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..