AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రావణంలో వర్షపు నీటితో ఈ పరిహారాలు చేయండి.. ఆర్థిక సమస్యలు తొలగి అదృష్టం కలిసొస్తుందట!

Shravan Month Rainwater Remedies: శ్రావణ మాసంలో కురిసే వర్షపు నీటికి జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని నమ్ముతారు. స్వచ్ఛమైన వర్షపు నీటితో చేసే కొన్ని సులభమైన పరిహారాలు ఆర్థిక సమస్యలు, మానసిక అశాంతి తొలగి ఇంట్లో శాంతి, శ్రేయస్సు కలిగిస్తాయని విశ్వాసం.

శ్రావణంలో వర్షపు నీటితో ఈ పరిహారాలు చేయండి.. ఆర్థిక సమస్యలు తొలగి అదృష్టం కలిసొస్తుందట!
Shravan Month Rainwater Remedies
Rajashekher G
|

Updated on: Aug 12, 2026 | 2:56 PM

Share

Shravan Month Rainwater Remedies Telugu: శ్రావణ మాసంలో కురిసే వర్షాలు ప్రకృతికి సరికొత్త అందాన్ని తీసుకొస్తాయి. వర్షాలతో వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా, ఎండిపోయిన భూములు పచ్చదనంతో కళకళలాడుతాయి. భారతీయ సంప్రదాయాల్లో వర్షపు నీటికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, మత విశ్వాసాల్లో స్వచ్ఛమైన వర్షపు నీటితో కొన్ని పరిహారాలు చేస్తే సానుకూల ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే ఇవి మతపరమైన విశ్వాసాలు మాత్రమే. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన పరిహారాలుగా భావించకూడదు. ఆ విశ్వాసాల ప్రకారం వర్షపు నీటితో చేసే కొన్ని సాధారణ పరిహారాలు ఇవి.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు..

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు వర్షపు నీటితో ఈ పరిహారం చేయవచ్చని జ్యోతిష్య విశ్వాసం చెబుతోంది. ఇందుకోసం శుభ్రమైన వర్షపు నీటిని మట్టి కుండ లేదా రాగి పాత్రలో సేకరించాలి. అందులో చిటికెడు పసుపు వేసి ఇంటి ఉత్తర దిశలో ఉంచాలి. వరుసగా 11 రోజుల పాటు ఉదయం, సాయంత్రం ఆ పాత్ర దగ్గర దీపం వెలిగించాలని కొందరు నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని విశ్వాసం.

ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం..

కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం తప్పనిసరి. దానికి తోడు ఆధ్యాత్మిక విశ్వాసంగా వర్షపు నీటితో ఒక పరిహారం చేయవచ్చని చెబుతారు. శుభ్రమైన వర్షపు నీటిని రాగి లేదా ఉక్కు పాత్రలో తీసుకుని శివుడిని పూజించిన అనంతరం ఆ నీటిని శివలింగానికి సమర్పించాలి. ఆ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించాలని మత విశ్వాసం. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక ధైర్యం కలుగుతాయని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

మానసిక అశాంతి, నిద్రలేమి తగ్గేందుకు..

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం మానసిక అశాంతి, నిద్రలేమి, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలకు కూడా వర్షపు నీటితో కొన్ని పరిహారాలు సూచిస్తారు. ఇందుకోసం శుభ్రమైన వర్షపు నీటిని ఆకుపచ్చ రంగు గాజు సీసాలో నింపి ఇంట్లో ప్రశాంతమైన ప్రదేశంలో ఉంచాలని చెబుతారు. ఈ నీటిని కొంతకాలం భద్రపరచి, తదుపరి వర్షాకాలంలో పాత నీటిని తొలగించి కొత్త వర్షపు నీటిని సేకరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉందని నమ్ముతారు.

వర్షపు నీటిని సేకరించేటప్పుడు జాగ్రత్తలు..

వర్షపు నీటిని సేకరించేటప్పుడు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. పైకప్పులు, కాలువలు లేదా అపరిశుభ్రమైన ప్రదేశాల నుంచి వచ్చిన నీటిని ఉపయోగించకూడదు. ముఖ్యంగా తాగడానికి లేదా ఆరోగ్య సంబంధిత అవసరాలకు వర్షపు నీటిని ఉపయోగించాలంటే తగిన శుద్ధి లేకుండా ఉపయోగించకండి.

(Disclaimer: వర్షపు నీటితో చేసే ఈ పరిహారాలు జ్యోతిష్యం, వాస్తు, మతపరమైన విశ్వాసాల ఆధారంగా ప్రచారంలో ఉన్నవే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.)

Follow Us