AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు టాప్ బిజినెస్ వుమన్.. కోట్లలో ఆస్తులు.. ఎవరో తెలుసా?

ఒకప్పుడు తమ అందం, అభినయంతో అలరించిన హీరోయిన్లలో చాలా మంది ఇప్పుడు తమ భర్త, పిల్లలతో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరికొందరు సినిమాల్లో సహాయక నటులుగా సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. ఇంకొందరు మరొక అడుగు ముందుకేసి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఈ టాలీవుడ్ అందాల తార కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది.

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు టాప్ బిజినెస్ వుమన్.. కోట్లలో ఆస్తులు.. ఎవరో తెలుసా?
Tollywood Actress
Basha Shek
| Edited By: |

Updated on: Sep 25, 2025 | 4:33 PM

Share

ముంబైలోని ఓ హిందూ ఫ్యామిలీలో ఈమె పుట్టింది. డిగ్రీ పూర్తికాకుండానే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టింది. మొదట కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో కనిపించింది. ఆ తర్వాత కొన్ని యాడ్స్ లో యాక్ట్ చేసింది. ఆపై ఒక తెలుగు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. అది సూపర్‌హిట్ కావడంతో వరుసగా ఛాన్సులు దక్కించుకుంది. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసి ఆడియెన్స్ ను అలరించింది. పవన్ కల్యాణ్, బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ హీరోయిన్ పేరిట ఒక అరుదైన రికార్డు ఉంది. అదేంటంటే.. చాలామంది హీరోయినలకు సాధ్యం కాని విధంగా ఏకంగా తొమ్మిది భాషల్లో నటించిందీ ముద్దుగుమ్మ. ఓవైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తుండగానే పెళ్లిపీటలెక్కింద అందాల తార. ఒక ప్రముఖ నటుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈ అందాల తార ఇద్దరు పిల్లలకు అమ్మగా మారింది. దీంతో కొన్నాళ్ల పాటు నటనకు బ్రేక్ ఇచ్చింది. కొన్ని రోజులకు మళ్లీ సినిమాల్లోకి వచ్చినా ఎక్కువగా అవకాశాలు తెచ్చుకోలేకపోయింది. దీంతో నటనకు పూర్తిగా పుల్‌స్టాప్ పెట్టేసింది. ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంటోందీ అందాల తార.

ఫిల్మ్ ప్రొడక్షన్, ఈవెంట్ ప్రమోషన్, స్పోర్ట్స్ ప్రమోషన్స్ లాంటి ఫీల్డ్స్‌లో వర్క్ చేస్తోన్న ఈ అందాల తార మరెవరో కాదు.. పవన్ కల్యాణ్ తమ్ముడు హీరోయిన్ ప్రీతి జింగానియా. నరసింహ నాయుడులో బాలకృష్ణతో, అధిపతి మూవీలో మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. అలాగే అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్, ఆనందమానందమాయే సినిమాల్లోనూ తళుక్కుమంది. ఎన్టీఆర్ నటించిన యమదొంగలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. దీని తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ కనిపించలేదు ప్రీతి.

ఇవి కూడా చదవండి

ప్రీతి జింగానియా లేటెస్ట్ ఫొటోస్..

2008లో నటుడు పర్వీన్ దబాస్‌ని పెళ్లి చేసుకున్న ఈ అందాల తార ఇప్పుడు బిజినెస్ వుమన్ గా బిజి బిజీగా ఉంటోంది. భర్తతో కలిసి ‘స్వెన్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే కంపెనీని రన్ చేస్తోంది ప్రీతి. అలాగే ప్రో పంజా లీగ్’ అనే ఆర్మ్ రెజ్లింగ్ టోర్నమెంట్‌కు కో-ఫౌండర్‌గా కూడా వ్యవహరిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
బాబోయ్.. భారత్ లో క్రెడిట్ కార్డులకు చెక్ పెడుతోన్న కొత్త ట్రెండ్
బాబోయ్.. భారత్ లో క్రెడిట్ కార్డులకు చెక్ పెడుతోన్న కొత్త ట్రెండ్
SIR వెరిఫికేషన్‌ పేరిట వచ్చి.. పుస్తెల తాడు తెంపుకుపోయిండ్రు!
SIR వెరిఫికేషన్‌ పేరిట వచ్చి.. పుస్తెల తాడు తెంపుకుపోయిండ్రు!
సీఎస్కే హెడ్ కోచ్ ప‌ద‌వికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్‌బై..!
సీఎస్కే హెడ్ కోచ్ ప‌ద‌వికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్‌బై..!
ఇంట్లో పేలిన ఫ్రిడ్జ్..బయటకు పరుగో పరుగు...
ఇంట్లో పేలిన ఫ్రిడ్జ్..బయటకు పరుగో పరుగు...
AP SSC పబ్లిక్‌ 2027 పరీక్షల్లో భారీమార్పులు.. బట్టీపడితే కుదరదిక
AP SSC పబ్లిక్‌ 2027 పరీక్షల్లో భారీమార్పులు.. బట్టీపడితే కుదరదిక
ఆ సంఘటనతో ఎనిమిది సినిమాలు వదులుకున్నా..
ఆ సంఘటనతో ఎనిమిది సినిమాలు వదులుకున్నా..
సీఎస్కే యువ హిట్టర్‌పై కన్నేసిన ముంబై, గుజరాత్.. కట్‌చేస్తే..!
సీఎస్కే యువ హిట్టర్‌పై కన్నేసిన ముంబై, గుజరాత్.. కట్‌చేస్తే..!
గోరింటాకు ఎర్రగా పండాలంటే ఈ టిప్స్ పాటించండి చాలు..
గోరింటాకు ఎర్రగా పండాలంటే ఈ టిప్స్ పాటించండి చాలు..
కదులుతున్న రైల్లో హోమం.. ఇదేంటి స్వామి.. రైల్వేశాఖ ఏం చెప్పిందంటే
కదులుతున్న రైల్లో హోమం.. ఇదేంటి స్వామి.. రైల్వేశాఖ ఏం చెప్పిందంటే