AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రాజకుటుంబంలో జననం.. 100 ఎకరాల భూమి.. కోట్ల ఆస్తిని వదిలేసి సినిమాల్లోకి.. చివరికి ఇప్పుడిలా..

పేరుకు తమిళ నటుడే అయినప్పటికీ తెలుగు ఆడియెన్స్ కూడా ఇతను పరిచయమే. మొదట హీరోగా, ఆ తర్వాత సహాయక నటుడిగా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఈ నటుడి భార్య కూడా ఫేమస్ హీరోయిన్. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటించింది.

Tollywood: రాజకుటుంబంలో జననం.. 100 ఎకరాల భూమి.. కోట్ల ఆస్తిని వదిలేసి సినిమాల్లోకి.. చివరికి ఇప్పుడిలా..
Tollywood Actor
Basha Shek
|

Updated on: Sep 24, 2025 | 7:50 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారిలో ఈ నటుడు కూడా ఒకరు. అయితే సినిమా నేపథ్యం లేనప్పటికీ ఈ హీరో బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదు. ఒక కుగ్రామంలో పుట్టిన ఈ నటుడి తండ్రి ఒక పోలీసు అఫీసర్. పోలీసు ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత పంచాయతీ అధ్యక్షుడు కూడా అయ్యాడు. ఈ నటుడి వాళ్ల సొంతూర్లో ఒక రాజభవనం ఉంది. దీనిని పూర్తిగా రాయితో నిర్మించారు. అయితే ఇప్పుడు అది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ నటుడి కుటుంబానికి అదే ఊరిలో 100 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. ఇప్పుడు వాటి విలువ కోట్లలోనే ఉంటుంది. అయితే ఈ నటుడి కుటుంబీకులు మాత్రం ఈ కోట్ల ఆస్తులన్నీ అమ్మేసి అందరూ పంచుకున్నారు. ఇప్పుడు ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీగా ఉంటున్నారు. అందులో చాలా మంది విదేశాల్లో సెటిలైపోయారు. కానీ ఈ ఒకరు మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే సెటిలైపోయారు. అతను మరెవరో కాదు రాంకీ.. ఈ పేరు చెబితే చాలా మందికి గుర్తుకు రాకపోవచ్చు.. కానీ సింధూర పువ్వు హీరో అంటే ఇట్టే గుర్తు పడతారు.

ఇవి కూడా చదవండి

రాంకీ కుటుంబంలో అందరూ బాగా చదువుకున్న వాళ్లే. అయితే రాంకీకి మాత్రం చదువు అబ్బలేదు. దీంతో నటనపై మక్కువతో ఇల్లు వదిలేసి సినిమాల్లోకి వచ్చేశాడు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో హీరోగా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అలాగే సహాయక నటుడిగానూ మెప్పించాడు. ముఖ్యంగా దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ఓసేయ్ రాములమ్మ సినిమా రామ్‌కీకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నాడీ స్టార్ నటుడు. ఆర్ ఎక్స్ 100 సినిమాలో రాంకీ పోషించిన పాత్ర ఓ రేంజ్ లో పేలింది. ఇక గతేడాది రిలీజైన దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్‌లోనూ ఓ కీలక పాత్ర పోషించడు రామ్ కీ. ఈ పాత్ర కూడా తెలుగు ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది. ప్రస్తుతం సహాయక నటుడిగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు రాంకీ.

రాంకీ లేటెస్ట్ ఫొటోస్..

అన్నట్లు రాంకీ భార్య కూడా ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. బాలకృష్ణ హీరోగా నటించిన ముద్దుల మావయ్య సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నారి నారి నడుమ మురారి, అత్తింట్లో అద్దె మొగుడు, డిటెక్టీవ్ నారద, స్టువర్ట్ పురం దొంగలు.. ఇలా చాలు సినిమాల్లో నటించింది.

భార్య నిరోషాతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..