AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi: యానిమేషన్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్న అనిల్‌

Anil Ravipudi: యానిమేషన్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్న అనిల్‌

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 14, 2026 | 7:09 PM

Share

అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్‌గా ఓ భారీ యానిమేషన్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఆయన కామెడీ స్టైల్ యానిమేషన్‌లో అద్భుతాలు సృష్టిస్తుందని సినీ జనాలు ఆశిస్తున్నారు. 'టాక్సిక్ ప్రొడ్యూసర్స్' మరియు 'KVN ప్రొడక్షన్స్' ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాయని తెలుస్తోంది. వెంకటేష్-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ తర్వాత ఈ యానిమేషన్ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

అసలే కామెడీ టింజ్‌ కాస్త ఎక్కువగా ఉన్న డైరక్టర్‌. యానిమేషన్‌ ని టేకప్‌ చేస్తే మామూలుగా ఉంటుందా? అని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. ఓ రేంజ్‌ కామెడీని పండించడం ఖాయం అని గ్యారంటీగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ కెప్టెన్‌ ఎవరో కళ్ల ముందు ఫ్లాష్‌ అయ్యారా లేదా? సరే… మనం చెక్‌ చేసుకుందాం వచ్చేయండి.. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్‌గారు సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ కావడంతో క్లౌడ్‌ నైన్‌లో ఉన్నారు అనిల్‌ రావిపూడి. అదే జోరుతో ఫోర్త్ కమింగ్‌ ప్రాజెక్టులను జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే విక్టరీ వెంకటేష్‌ అండ్‌ కల్యాణ్‌ రామ్‌తో ప్రాజెక్ట్ సెట్‌ చేశారు. బ్యాక్‌ టు బ్యాక్‌ వెంకటేష్‌ తో సినిమాలు చేస్తున్న అనిల్‌ రావిపూడి, నెక్స్ట్ చేయబోయే మల్టీస్టారర్‌ ఫక్తు డిఫరెంట్‌గా ఉంటుందని ఆల్రెడీ డిక్లేర్‌ చేశారు. వెంకీ, కల్యా్ణ్‌ రామ్‌ సినిమా 2027 సంక్రాంతికి కంప్లీట్‌ అవుతుంది. ఈ మూవీ తర్వాత అనిల్‌ ఏం చేస్తారనే టాక్‌ కూడా ఆల్రెడీ ఇండస్ట్రీలో షురూ అయింది. ఓ యానిమేషన్‌ బిగ్గీని ప్లాన్‌ చేస్తున్నారట అనిల్‌. టాక్సిక్‌ ప్రొడ్యూసర్స్ ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్తారన్నది ఇప్పుడు వైరల్‌ న్యూస్‌. ఆల్రెడీ విజయ్‌ తో జననాయగన్‌ చేసే టైమ్‌ నుంచే అనిల్‌కి కేవీయన్‌ ప్రొడక్షన్స్ తో మంచి ర్యాపో ఉందట. ఈ క్రమంలోనే ఈ యానిమేషన్‌ ఐడియాను షేర్‌ చేసుకున్నారని, ప్రాజెక్ట్ ని అతి త్వరలోనే అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెగటివ్‌ ట్రోలింగ్‌ మీద గళం విప్పుతున్న నాయికలు

Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??

Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా

Dhurandhar 2: భారీ నిడివి ధురంధర2కి వరమా ?? శాపమా ??

కర్ణాటకలో ఎగ్జిబిటర్స్‌ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే

Follow Us