నెగటివ్ ట్రోలింగ్ మీద గళం విప్పుతున్న నాయికలు
పూజా హెగ్డే, ప్రియాంక అరుళ్ మోహన్ వంటి సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న 'పెయిడ్ ట్రోలింగ్' సమస్య గ్లామర్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే ఈ నెగటివ్ ప్రచారాన్ని వారు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. సద్విమర్శలను స్వాగతిస్తూ, పని గట్టుకుని బురద జల్లుతున్న వారిపై జాలి చూపిస్తూ, పాజిటివ్‌గా ముందుకు సాగాలనే వారి స్ఫూర్తిదాయక సందేశం ఈ ఆర్టికల్‌లో ఉంది.
ఇష్యూ ఒకటే. కాకపోతే ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు స్పందిస్తుంటారు. ఆ మధ్య పూజా హెగ్డే.. ఇప్పుడు మన ఓజీ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. విషయమేంటి అంటే నెగటివ్ ట్రోలింగ్. పెయిడ్ ట్రోలింగ్. ఈ ఇష్యూ ఇప్పట్లో తెగేది కాదుగా అన్నది చాలా మంది ఫీలింగ్. మేం ఫేస్ చేస్తున్నాం కదా అన్నది గ్లామర్ ఇండస్ట్రీ మాట. ఆన్‌లైన్‌లో నెగటివ్ ట్రోలింగ్ ఉంటుందని చాలా సార్లు చెప్పారు పూజా హెగ్డే. కొందరు పని గట్టుకుని పెయిడ్ ట్రోలింగ్ చేయిస్తుంటారనే విషయం నాకు నిదానంగా అర్థమైంది. కాకపోతే జెన్యూన్ అభిమానం నాకు ఎయిర్‌పోర్టుల్లో అర్థమవుతూ ఉంటుంది. అందుకే నెగటివ్‌ని మానేసి, పాజిటివ్‌ని తీసుకుంటున్నానని చెప్పారు పూజా. మొదట్లో ఈ పెయిడ్ ట్రోలింగ్‌కి ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఫీలయ్యేవారని ఆ మధ్య గుర్తుచేసుకున్నారు సిల్వర్ స్క్రీన్ అరవింద. ఆ తర్వాత వారికీ పరిస్థితి అర్థమైందన్నారు. ఇప్పుడు సేమ్ ఇదే ఇష్యూ మీద స్పందించారు ఓజీ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్. ఆమె నటించిన మేడిన్ కొరియా రిలీజ్‌కి ముస్తాబైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెయిడ్ ట్రోలింగ్ గురించి ప్రస్తావించారు ప్రియాంక. ఇండస్ట్రీలో ఇలాంటి ఫేక్ థింగ్స్ వల్ల చాలా సవాళ్లను ఎదుర్కున్నట్టు చెప్పారు. తనతో పాటు హీరో, హీరోయిన్లు చాలా మంది ఈ పెయిడ్ ప్రమోషన్ల వల్ల ఇబ్బందులు ఫేస్ చేశరన్నారు. సద్విమర్శలను తానెప్పుడూ ఆహ్వానిస్తానన్నారు ప్రియాంక. ఒకరి మీద లేని బురద జల్లి ప్రయోజనం పొందాలనుకునేవారి మానసికపరిస్థితిని తలచుకుంటే జాలి వేస్తుందన్నారు. తనను ఎవరైనా కిందికి లాగడానికి ప్రయత్నిస్తే, అంతకు రెట్టింపు స్పీడుతో ఎదగాలన్న ఆలోచన తనకు ప్లస్ అవుతుందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్.. రుక్మిణికి కలిసొస్తుందా ??
Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా
Dhurandhar 2: భారీ నిడివి ధురంధర2కి వరమా ?? శాపమా ??
కర్ణాటకలో ఎగ్జిబిటర్స్ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్
రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు
నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు

