AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unni Mukundan: మరోసారి చిక్కుల్లో ఉన్ని ముకుందన్‌.. ‘మా వందే’ హీరోకు కేరళ కోర్టు నోటీసులు.. కారణమిదే

మార్కో సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళ హీరో ఉన్ని ముకుందన్. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయోపిక్ మా వందేలోనూ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే తాజాగా ఈ హీరోకు ఓ కేసు విషయంలో కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Unni Mukundan: మరోసారి చిక్కుల్లో ఉన్ని ముకుందన్‌.. 'మా వందే' హీరోకు కేరళ కోర్టు నోటీసులు.. కారణమిదే
Unni Mukundan
Basha Shek
|

Updated on: Sep 23, 2025 | 11:19 AM

Share

ఉన్ని ముకుందన్.. మార్కో సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయాడీ మలయాళ హీరో. అంతకు ముందు పలు తెలుగు సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడి పాత్రలతోనూ ఆకట్టుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. గతేడాది రిలీజైన మార్కో సినిమా ముకుందన్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. అదే సమయంలో సినిమాలో హింస మరీ ఎక్కువైందంటూ కొందరి నుంచ తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఈ కారణంగానే మార్కో సీక్వెల్ లో నటించడం లేదంటూ ప్రకటించాడు. ఇటవలే ఉన్నీ ముకుందన్ లేకుండానే మార్కో పార్ట్ 2 ప్రారంభమైంది. అయితే ఈ మలయాళ నటుడు ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న మా వందేలో మెయిన్ లీడ్ లో యాక్ట్ చేస్తున్నాడు. సీహెచ్ క్రాంతికుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఎం. వీర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ బయోపిక్ పట్టాలెక్కగా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైందని తెలుస్తోంది. అయితే ఇంతలోనే హీరో ఉన్ని ముకుందన్ కు కేరళ కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

కొద్దిరోజుల క్రితం ఉన్నిముకుందన్‌పై తన మాజీ మేనేజర్‌ విపిన్‌ కుమార్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరో మలయాళ హీరో టొవినో థామస్‌ నటించిన నరివెట్ట సినిమాను ప్రశంసించిన విపిన్ అదే సమయంలో ఉన్నిముకుందన్‌ను కించపరిచాడు. దీంతో ముకుందన్‌ విపిన్‌ కుమార్‌పై దాడి చేశాడని సమాచారం. మార్కో హీరో తనపై దుర్భాషలాడారని, దాడి చేశారంటూ కొన్ని రోజుల క్రితం విపిన్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఉన్నిముకుందన్‌పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాలుగా సీసీటీవీ ఫుటేజ్‌ వీడియోను అందించారు.

మాజీ మేనేజర్ పై దాడి కేసులో..

ఇప్పుడు ఇదే కేసు విషయంలో కేరళలోని కాకనాడ్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఉన్ని ముకుందన్ కు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 27న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, విపిన్‌ చేసిన ఆరోపణలను ముకుందన్‌ కొట్టిపారేశాడు. తాను విపిన్ కళ్లద్దాలు మాత్రమే పగలగొట్టానని తప్పు ఒప్పుకొన్నాడు.

మా వందే సినిమా ఫస్ట్ లుక్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..