AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్.. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్స్ ప్రారంభం

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్‌ కొరతపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఎలాంటి కొరత లేదని.. ప్రజలు ఆందోళనతో బుకింగ్స్‌ చేయడం వల్లే సమస్య వచ్చిందని పెట్రోలియం శాఖ జాయింట్‌ సెక్రటరీ సుజాత శర్మ పేర్కొంది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ మళ్లీ ప్రారంభించినట్టు తెలిపింది.

కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్.. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్స్ ప్రారంభం
India Lpg Supply
Anand T
|

Updated on: Mar 14, 2026 | 6:37 PM

Share

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశంలో ఎల్‌పీజీ సరఫరాపై నిలిచి పోయిందని ప్రజల్లో ఆందోళన పెరిగిపోయింది. దీంతో గ్యాస్ దొరుకుతుందో లేదో అని జనాలు ఎగబడి బుకింగ్స్ చేసుకోవడం ప్రారంభించారు.ఈ నేపథ్యంలో దేశంలోని గ్యాస్ కొరతపై తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎలాంటి కొరత లేదని.. ప్రజలు ఆందోళనతో బుకింగ్స్‌ చేయడం వల్లే సమస్య వచ్చిందని పెట్రోలియం శాఖ జాయింట్‌ సెక్రటరీ సుజాత శర్మ పేర్కొంది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ మళ్లీ ప్రారంభించినట్టు తెలిపింది. LPG కొరత నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా పెట్రోలియం శాఖ జాయింట్‌ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా సిలిండర్లు దొరకవేమోనన్న భయంతో ప్రజలు ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారని.. ఇప్పటివరకు దాదాపు 88 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయని ఆమె తెలిపింది. అవసరమైతే తప్ప ముందస్తు బుకింగ్స్ చేయవద్దని కోరింది. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎల్‌పీజీ కొనుగోలుదారుగా ఉందని.. మన దేశానికి వచ్చే ఎల్‌పీజీలో 90 శాతం వాటా హార్ముజ్ గుండానే వస్తున్నాయని పేర్కొంది.

అయితే ప్రస్తుతం అక్కడ రాకపోకలు నిలిచిపోవడం కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇరాన్ భారత్‌కు సహకరిస్తుందని పేర్కొంది. అటు నుంచి భారత్‌కు వచ్చే నౌకలను అడ్డుకోబమని ఇప్పటికే ఇండియాకు ఇరాన్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఇదే అంశంపై పెట్రోలియం శాఖ జాయింట్‌ సెక్రటరీ సుజాత శర్మ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో హర్మూజ్‌ నుంచి రెండు LPG నౌకలు భారత్‌కు వస్తున్నాయని తెలిపారు. అంతేకాదు భారత్‌లో పెట్రోల్, డీజిల్, చమురు నిల్వలు తగినంతగా ఉన్నాయని, వాటి విషయంలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. ఏ మంత్ర తంత్రాలు మీపై పనిచేయవ్
ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. ఏ మంత్ర తంత్రాలు మీపై పనిచేయవ్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది..
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది..
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!