AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10th Class Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత

10th Class Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత

Phani CH
|

Updated on: Mar 14, 2026 | 5:43 PM

Share

ఏపీ పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుండి ప్రారంభం. ఈ ఏడాది 6.4 లక్షల మంది విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. హాల్‌టికెట్లపై QR కోడ్ ద్వారా పరీక్షా కేంద్రం లొకేషన్, APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం, నిమిషం నిబంధన సడలింపు వంటివి ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 4 నుండి పారదర్శక మూల్యాంకనానికి ట్యాబ్‌లలో మార్కుల నమోదు విధానం అమలు చేయనున్నారు.

ఏపీలో పదో తరగతి పరీక్షలకు రంగం సిద్ధమైంది. మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వీరి కోసం 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్, ఉచిత బస్సు ప్రయాణం, నిమిషం నిబంధన సడలింపు వంటివి వీటిలో ప్రధానమైనవి. పట్టణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను వెతుక్కోవడం విద్యార్థులకు పెద్ద సవాలుగా మారుతుంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఈసారి హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. విద్యార్థులు తమ మొబైల్ ఫోన్‌తో ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. నేరుగా గూగుల్ మ్యాప్స్ ద్వారా పరీక్షా కేంద్రం లొకేషన్ కనిపిస్తుంది. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా గందరగోళం తప్పుతుంది. అంతేకాదు, విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు, తిరిగి ఇంటికి వచ్చేందుకు విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను చూపిస్తే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సౌకర్యం పరీక్షలు జరిగే అన్ని రోజుల్లోనూ అందుబాటులో ఉంటుంది. గతంలో అమల్లో ఉన్న కఠినమైన ‘నిమిషం నిబంధన’పై ఈసారి ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. పరీక్ష ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచే లోపలికి అనుమతిస్తారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఎవరైనా ఆలస్యమైతే, పరీక్ష మొదలైన అరగంట వరకు అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల విద్యార్థులపై అనవసర ఒత్తిడి తగ్గుతుంది. పరీక్షల నిర్వహణతో పాటు పారదర్శకమైన మూల్యాంకనానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం 26 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మార్కుల లెక్కింపులో పొరపాట్లకు తావివ్వకుండా ఉండేందుకు, ట్యాబ్లెట్లలో మార్కులను నమోదు చేసే నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 జవాబు పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేసేలా నిబంధన విధించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి

కుక్కల్ని వీధుల్లో వదిలేసి.. దేశాన్ని వీడుతున్న జనం

ఇరాన్‌ ‘దోమల దండు’ దెబ్బకి.. అమెరికా వెన్నులో వణుకు

Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..

ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..

Follow Us