AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కావ్యా పాపా.. ఏంటి నువ్ చేసిన పని?’

‘కావ్యా పాపా.. ఏంటి నువ్ చేసిన పని?’

Phani CH
|

Updated on: Mar 14, 2026 | 5:17 PM

Share

ది హండ్రెడ్‌ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ పాక్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం వివాదాస్పదమైంది. భారత అభిమానుల తీవ్ర వ్యతిరేకత, గతంలో అబ్రార్ చేసిన భారత్ వ్యతిరేక పోస్ట్‌ల కారణంగా సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక 'ఎక్స్' ఖాతా సస్పెండ్ అయ్యింది. 2009 తర్వాత భారత ఫ్రాంచైజీ పాక్ ప్లేయర్‌ను కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి.

ఇంగ్లాండ్ వేదికగా జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీ ‘ది హండ్రెడ్‌’ లీగ్‌లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ లీడ్స్‌. అయితే ఆ ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు అధికారిక ‘ఎక్స్’ ట్విట్టర్ ఖాతా అనూహ్యంగా సస్పెన్షన్‌కు గురైంది. పాక్ క్రికెటర్‌ను తీసుకోవడంపై భారత అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే సోషల్ మీడియా అకౌంట్ సస్పెన్షన్‌పై ఎక్స్ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. ఒకవైపు ఎక్స్ ఖాతా ఏమైందనేది తెలియకపోగా, మరోవైపు ఫ్యాన్స్ మాత్రం నిన్నటి నుంచి పాక్ ప్లేయర్ కొనుగోలు విషయంపై భారీ స్థాయిలో సన్‌రైజర్స్ లీడ్స్‌ ఖాతాను టార్గెట్ చేశారు. ఇంగ్లాండ్‌లో జరిగిన ‘ది హండ్రెడ్’ లీగ్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను రూ.2.34 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో సన్‌రైజర్స్ సీఈవో కావ్యా మారన్, ప్రధాన కోచ్ డానియల్ వెట్టోరి స్వయంగా పాల్గొన్నారు. ట్రెంట్ రాకెట్స్ జట్టుతో తీవ్రంగా పోటీపడి మరీ అబ్రార్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. జట్టుకు ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ సారథ్యం వహిస్తున్నాడు. ది హండ్రెడ్ లీగ్‌లో భారత ఐపీఎల్ ఫ్రాంచైజీలకు వాటాలున్నాయి. దీంతో పాక్ ఆటగాళ్లకు ఇక్కడ కూడా అవకాశం దక్కదని అభిమానులు భావించారు. కానీ లీగ్ నిర్వాహకులు అనుమతించడంతో వారు వేలంలోకి వచ్చారు. 2009లో ఐపీఎల్‌‌ నుంచి పాక్ క్రికెటర్లను నిషేధించిన తర్వాత, ఒక భారతీయ ఫ్రాంచైజీ యాజమాన్యం పాక్ ప్లేయర్‌తో ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. దీనికి తోడు, గతంలో ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో అబ్రార్ అహ్మద్ భారత్‌ను అవమానిస్తూ పోస్టులు చేశాడని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అలాంటి ఆటగాడిని కొనుగోలు చేయడంపై కావ్యా మారన్‌ను, సన్‌రైజర్స్ యాజమాన్యాన్ని సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. సన్‌రైజర్స్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో, ఖాతాపై భారీగా రిపోర్ట్ చేయడం వల్లే ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ సస్పెండ్ అయి ఉంటుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇరాన్‌ ‘దోమల దండు’ దెబ్బకి.. అమెరికా వెన్నులో వణుకు

Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..

ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..

Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు

Follow Us