అరే.. ఇదేం చేప.. ప్లేస్‌ను బట్టి రంగు మార్చేస్తోంది!
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల వలకు అరుదైన రంగులు మార్చే బొంతచేప చిక్కింది. పరిసరాల రంగులకు అనుగుణంగా శరీర రంగును మార్చే ఈ చేపను చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ చేపకు మంచి డిమాండ్ ఉండగా, కిలో రూ.400 నుంచి రూ.450 వరకు ధర పలుకుతుందని మత్స్యకారులు తెలిపారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్యకారుల వలకు ఓ విచిత్రమైన చేప చిక్కింది. విచిత్రమేమరి.. అది స్థలాన్ని బట్టి తన రంగును మార్చేస్తోంది. అచ్చం ఊసరవెల్లిలా.. అవును, సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌లో ఈ అరుదైన రంగుల బొంతచేప మత్స్యకారుల వలకు చిక్కింది. విభిన్న రంగులతో ధగధగమెరిసిపోతున్న ఈ వింత చేపను చూసేందుకు స్థానికులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాధారణంగా బొంతచేపలు గోధుమ రంగు చుక్కలతో ఉంటాయని, కానీ ఇలా అనేక ఆకర్షణీయమైన రంగుల్లో కనిపించడం చాలా అరుదని మత్స్యకారులు చెబుతున్నారు. ఇవి సముద్రం, గోదావరి నది సంగమ ప్రాంతాల్లోని రాళ్ల చెంత జీవిస్తుంటాయని, వీటిని ప్రత్యేకంగా గేలాలతో వేటాడి పట్టుకుంటామని గంగపుత్రులు తెలిపారు. ఈ రకం బొంతచేపలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 400 నుంచి రూ. 450 వరకు ధర పలుకుతుందని వారు వెల్లడించారు. ఈ చేపల విశిష్టతపై రాజోలు మత్స్యశాఖ అధికారి సిద్ధార్థవర్దన్ మాట్లాడుతూ.. బొంతచేపలు తాము జీవించే పరిసర వాతావరణం మరియు రాళ్ల రంగులకు అనుగుణంగా తమ శరీర రంగును మారుస్తుంటాయని స్పష్టం చేశారు. ఈ అరుదైన వింత చేప ఇప్పుడు అంతర్వేది హార్బర్ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కర్నూలులో ఘరానా మోసం… తల్లికి వందనం సొమ్ము స్వాహా!
ఆగస్ట్ 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏ దేశాల్లో చూడొచ్చంటే!
Vande Bharat Cargo: గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’
అరే.. ఇదేం చేప.. ప్లేస్‌ను బట్టి రంగు మార్చేస్తోంది!
ఎలుకా.. మజాకా..!
వాళ్లిద్దరి చనువు వల్లే.. భార్యాభర్తల మధ్య గొడవలు
ఇక.. జ్ఞాపకంగా మిగలనున్న విశాఖ ఎయిర్పోర్ట్
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!

