AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి.. ఇప్పుడు సినిమాలకు దూరం.. ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఒక స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుందీ అందాల తార. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు అమ్మగా మారింది. ఈ ముద్దుగుమ్మ వెండితెరపై కనిపించక సుమారు ఆరేళ్లవుతోంది.కానీ అభిమానులు మాత్రం ఈ హీరోయిన్ ను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూడాలని తహతహలాడుతున్నారు.

కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి.. ఇప్పుడు సినిమాలకు దూరం.. ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Yash Wife Radhika Pandit
Basha Shek
|

Updated on: Sep 23, 2025 | 10:34 AM

Share

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? మొన్నటి వరకు ఆమె ఒక స్టార్ హీరోయిన్. అయితే ఓ స్టార్‌ హీరోతో ప్రేమ పెళ్లి తర్వాత క్రమంగా సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబాన్ని చూసుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు భర్తతో కలిసి యాడ్ షూట్స్ లోనూ పాల్గొంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేసుకుంటోంది. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ ముందుగా బుల్లితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాత వెండితెరకు పరిచయమైంది. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. తన అందం, అభినయంతో దక్షిణాదిలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అయితే సినిమాలు చేస్తున్నప్పుడే తనతో కలిసి నటించిన ఓ హీరోతో ప్రేమలో పడిందీ అందాల తార. ఇద్దరి మనసులు, అభిప్రాయాలు కలవడంతో ఇరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని రోజుల పాటు సినిమాల్లో యాక్ట్ చేసిందీ అందాల తార. అయితే పిల్లలు పుట్టాక మాత్రం క్రమంగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఈ అందాల తార క్రేజ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. అభిమానులు కూడా ఆమెను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూడాలని కోరుకుంటున్నారు.

ఇంతకీ పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే ఆన్సర్ కూడా మేమే చెబుతాం లెండి. ఆమె మరెవరో కాదు.. ప్రముఖ కన్నడ హీరోయిన్‌, పాన్ ఇండియా స్టార్‌ యశ్‌ భార్య రాధికా పండిట్‌. 2008లో ‘మొగ్గిన మనసు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రాధిక. అందులో తన భర్త యశ్‌తో కలిసి నటించింది. ఆ తర్వాత మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ రామాచారి మరోసారి ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఇద్దరి అభిరుచులు, అభిప్రాయలు కలవడంతో ప్రేమలో పడ్డారు.

ఇవి కూడా చదవండి

భర్త యశ్ తో రాధికా పండిట్..

పెద్దల అంగీకారతో 2016లో పెళ్లిపీటలెక్కారు యశ్‌, రాధికా పండిట్‌. అయితే పెళ్లికి ముందు కొన్ని సినిమాలకు సైన్‌ చేసి ఉండటంతో రాధిక 2019వరకు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఇంటికే పరిమితమైంది. యశ్‌, రాధిక దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఇప్పుడు వారి పెంపకంలోనే బిజి బిజీగా ఉంటోంది రాధిక.

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..