AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్ట్.. 5 నిమిషాల ఛార్జ్‌తో 800 కిలోమీటర్ల మైలేజ్.. ఈ కారు ఫీచర్స్ తెలిస్తే నోరెళ్లబెడతారు..

BYD Denza Z9GT: ఎలక్ట్రిక్ వాహనం అంటే ఛార్జింగ్ కావడానికి గంటల సమయం పడుతుందని అనుకుంటున్నారా..? అయితే ఇది మీ కోసమే.. చైనా ఈవీ దిగ్గజం బీవైడీ, ప్రపంచం నివ్వెరపోయే సాంకేతికతతో ముందుకు వచ్చింది. కేవలం ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో వందల కిలోమీటర్లు ప్రయాణించేసరికొత్త డెంజా Z9 GT మార్కెట్లోకి వస్తోంది. పెట్రోల్ కొట్టించినంత వేగంగా బ్యాటరీ నిండిపోయే ఈ అద్భుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

జస్ట్.. 5 నిమిషాల ఛార్జ్‌తో 800 కిలోమీటర్ల మైలేజ్.. ఈ కారు ఫీచర్స్ తెలిస్తే నోరెళ్లబెడతారు..
Byd New Denza Z9gt Charges 70 Percent In Just 5 Minutes
Krishna S
|

Updated on: Mar 14, 2026 | 4:59 PM

Share

ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు వాడేవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. అయితే ఎలక్ట్రిక్ అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రధాన సమస్య ఛార్జింగ్ సమయం. ఈ అడ్డంకిని అధిగమిస్తూ చైనాకు చెందిన ప్రముఖ ఈవీ దిగ్గజం బీవైడీ ఒక సంచలన ప్రకటన చేసింది. తన ప్రీమియం సబ్-బ్రాండ్ అయిన డెంజా నుంచి రాబోతున్న Z9 GT మోడల్‌తో ఛార్జింగ్ వేగంలో కొత్త చరిత్ర సృష్టించబోతోంది. వచ్చే నెలలో ఐరోపా మార్కెట్లో ఈ కారును విడుదల చేసేందుకు సంస్థ సర్వం సిద్ధం చేసింది.

మెరుపు వేగంతో ఫ్లాష్ ఛార్జింగ్

సాధారణంగా ఈవీ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి గంటల సమయం పడుతుంది. కానీ డెంజా Z9 GTలో ప్రవేశపెట్టిన సరికొత్త ఫ్లాష్ ఛార్జింగ్ సాంకేతికతతో కేవలం 5 నిమిషాల్లోనే 10శాతం నుండి 70శాతం వరకు బ్యాటరీని నింపవచ్చు. ఇది పెట్రోల్ బంకులో ఇంధనం నింపే సమయంతో దాదాపు సమానం. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ కారు అద్భుత పనితీరు కనబరుస్తుంది. 30 డిగ్రీల సెల్సియస్ వంటి గడ్డకట్టే చలిలో కూడా కేవలం 12 నిమిషాల్లో 20శాతం నుండి 97శాతం వరకు ఛార్జింగ్ పూర్తవుతుందని సంస్థ వెల్లడించింది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 800 కిలోమీటర్లు

ఈ కారు కేవలం ఛార్జింగ్ వేగంలోనే కాదు, ప్రయాణ దూరంలోనూ రికార్డులు సృష్టిస్తోంది. పూర్తి స్థాయిలో ఛార్జింగ్ చేస్తే సుమారు 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ కారులో మూడు మోటార్ల వ్యవస్థను ఉపయోగించారు. ఇది దాదాపు 1,000 హార్స్‌పవర్ సామర్థ్యాన్ని అందిస్తూ కారును అత్యంత వేగంగా అంటే 100 kmph కేవలం 3 సెకన్లలోనే అందుకుంటుంది.

ఐరోపా మార్కెట్ లక్ష్యంగా..

ప్రస్తుతం చైనాలో మంచి గుర్తింపు పొందిన డెంజా బ్రాండ్‌ను, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా ఐరోపాలోని లగ్జరీ కార్ల మార్కెట్లోకి బీవైడీ తీసుకెళ్తోంది. పోర్షే టైకాన్ వంటి లగ్జరీ స్పోర్ట్స్ కార్లకు ఇది గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారు ధర మరియు పూర్తి ఫీచర్లను వచ్చే నెలలో జరిగే లాంచ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించనున్నారు.

ముఖ్య విశేషాలు:

  • మోడల్: డెంజా Z9 GT (Denza Z9 GT)
  • టెక్నాలజీ: 800V హై-వోల్టేజ్ ప్లాట్‌ఫామ్ & ఫ్లాష్ ఛార్జింగ్.
  • రేంజ్: 800 కి.మీ.
  • ప్రత్యేకత: మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా వేగవంతమైన ఛార్జింగ్.

Follow Us