- Telugu News Photo Gallery Cinema photos Brahmamudi Serial Fame Swapna Alias Roopa Muggulla Shares Glamorous Photos
Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సీరియల్ హీరోహీరోయిన్లకు ఏ రేంజ్ క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. బుల్లితెరపై తమ నటనతో ఆకట్టుకుంటున్న నటీనటులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సీరియల్ తారలు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఓ బ్యూటీ నెట్టింట అందాల రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
Updated on: Sep 21, 2025 | 7:22 PM

బుల్లితెరపై సీరియల్లో అమాయకంగా కనిపిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. నిత్యం చీరకట్టులో పద్దతికి అంబాసిడర్ లా కనిపిస్తూ.. అందం, అభినయంతో మెప్పిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తోంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?

ఆమె పేరు రూప ముగ్గల్ల. ప్రస్తుతం బుల్లితెరపై మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న బ్రహ్మమూడి సీరియల్లో స్వప్న పాత్రలో నటిస్తుంది. ఇందులో మంచితనం, అమాయకత్వం, మొండితనం కలగలిసిన అమ్మాయిల సహజ నటనతో కట్టిపడేస్తుంది.

బ్రహ్మముడి సీరియల్లో అంతకుముందు స్వప్న పాత్రలో హమీదా ఖాతూన్ నటించింది. ఇక ఆ తర్వాత ఆమె స్థానంలోకి వచ్చింది రూప ముగ్గల్ల. ఇప్పటికే తెలుగులో అనేక సీరియల్స్ చేసిన రూప.. ఇప్పుడు బ్రహ్మాముడి సీరియల్ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది.

సీరియల్లో చీరకట్టులో కనిపించే రూప.. ఇప్పుడు నెట్టింట మాత్రం అందాల రచ్చ చేస్తుంది. నిత్యం ఇటు గ్లామర్.. అటు ట్రెడిషనల్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

అందులో రింగు రింగుల జుట్టు.. కిల్లింగ్ చూపులు.. మోడ్రన్ డ్రెస్సులో కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ కు తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తుంది.




