AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వింత ఘటన.. బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు

సోషల్ మీడియా వేదికగా ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక రైతు తన పొలంలో బోరుబావి తవ్వించగా, అందులో నుండి నీటికి బదులుగా మంటలు ఎగసిపడుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో బోరుబావి నుండి నీటికి బదులు మంటలు రావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. బోరుబావి పైకి నీరు రాకపోగా, దాని నుండి గ్యాస్ లీక్ అవుతున్నట్లు గమనించిన స్థానికులు నిప్పు పెట్టి చూడగా, భారీగా మంటలు వచ్చాయి. ఈ దృశ్యం చూసి గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం ఈ మంటల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వింత ఘటన.. బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
Borewell fire in Madhya Pradesh
Jyothi Gadda
|

Updated on: Mar 14, 2026 | 3:02 PM

Share

సాధారణంగా పంట పొలాల్లో నీటి కోసం బోరుబావులు తవ్విస్తారు. కానీ, మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడ ఒక రైతు పొలంలో వేసిన బోరుబావి నుండి ఏకంగా మంటలు వస్తున్నాయి. సాగర్ జిల్లాలోని బండా తహసీల్ పరిధిలో ఉన్న ఒక రైతు తన వ్యవసాయ అవసరాల కోసం బోరుబావి తవ్వించాడు. దాదాపు కొన్ని వందల అడుగుల లోతు వరకు తవ్వినా నీరు పడలేదు. అయితే, బోరు పైపు నుండి ఒక రకమైన గ్యాస్ వాసన రావడం ప్రారంభమైంది. స్థానికులు ఉత్సుకతతో ఒక అగ్గిపుల్ల గీసి పైపు దగ్గర వేయగా, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు 5 నుండి 10 అడుగుల ఎత్తు వరకు ఈ మంటలు ఎగసిపడటంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.

భూగర్భంలో కుళ్ళిన చెట్లు లేదా సేంద్రియ పదార్థాల వల్ల ‘మిథేన్’ వాయువు ఏర్పడుతుంది. బోరు తవ్వినప్పుడు ఆ వాయువు నిల్వలు బయటకు రావడం వల్ల ఇలా మంటలు వచ్చే అవకాశం ఉందని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి సహజ వాయువు నిల్వలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి.

ఈ ఘటనతో గ్రామంలో ఒక రకమైన భయం నెలకొంది. భూమి లోపల ఏవైనా భారీ మార్పులు జరుగుతున్నాయా? అని జనం ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందిస్తూ.. ప్రజలెవరూ ఆ మంటల దగ్గరకు వెళ్లవద్దని, ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. భూగర్భ పరిశోధన విభాగం అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అది ఏ రకమైన గ్యాస్ అనేది నిర్ధారించనున్నారు.

ఇవి కూడా చదవండి

గతంలో కూడా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ, సాగర్ జిల్లాలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఈ మండే బోరుబావి వీడియో ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
పొయ్యి ముట్టించే పనే లేదు.. అదిరే రోటి పచ్చడి ఇలా రెడీ చేస్కోండి
పొయ్యి ముట్టించే పనే లేదు.. అదిరే రోటి పచ్చడి ఇలా రెడీ చేస్కోండి
సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు!
సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు!
ఓర్నాయనో పెద్ద కథే ఉందిగా.. రోడ్డు మీద డబ్బు దొరికితే ఏం..
ఓర్నాయనో పెద్ద కథే ఉందిగా.. రోడ్డు మీద డబ్బు దొరికితే ఏం..
సక్సెస్ ఫార్ములాతో టాలీవుడ్ హీరోయిన్..
సక్సెస్ ఫార్ములాతో టాలీవుడ్ హీరోయిన్..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి పెళ్లి యోగాలు..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి పెళ్లి యోగాలు..!