AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: వర్షాలు వచ్చేశాయ్ బుల్లోడా.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే.. మున్ముందు మరింత మండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు వాతావరణ నిపుణులు.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

Weather Alert: వర్షాలు వచ్చేశాయ్ బుల్లోడా.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Weather Report
Shaik Madar Saheb
|

Updated on: Mar 14, 2026 | 2:28 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే.. మున్ముందు మరింత మండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు వాతావరణ నిపుణులు.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని మధ్య ప్రాంతాల నుంచి అంతర్గత ఛత్తీస్‌గఢ్ మీదుగా దక్షిణ అంతర ఒడిశా వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి కొనసాగుతున్నది. దీంతోపాటు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో మరఠ్వాడా నుండి దక్షిణ అంతర కర్ణాటక వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి ఉన్నది .

ఏపీలో వర్షాలు..

వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి / పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

రాయలసీమ :-

గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ & యానాంలో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు లో గణనీయమైన మార్పు లేదు ఆతదుపరి 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గే అవకాశముంది. రాయలసీమలో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు ఆ తదుపరి 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

ద్రోణి ఒకటి మరాత్వాడ ప్రాంతం నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్నాటక వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది.. నిన్న జార్ఖండ్ ప్రాంతం నుండి విదర్భ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు ఉత్తర ఉత్తర ప్రదేశ్ మధ్య ప్రాంతం నుండి చత్తీస్గడ్ మీదుగా దక్షిణ అంతర్గత ఒడిశా వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. శనివారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.

ఆదివారం తెలంగాన రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, పశ్చిమ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

సోమవారం రాష్ట్రంలోని ఉత్తర, మధ్య జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. తదుపరి నాలుగు, ఐదు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.

ఆదివారం, సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్