AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: తండ్రి చేసిన పాపాలకు కూతురు బలి.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్

నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా తీసిన సినిమాలు, వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీ సినిమాలు టాప్ ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ స్టోరీనే.

OTT Movie: తండ్రి చేసిన పాపాలకు కూతురు బలి.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్
Ott Movie
Basha Shek
|

Updated on: Oct 06, 2025 | 8:04 PM

Share

అభంశుభం తెలియని ఎంతో మంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. తమ జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుంటున్నారు.. అలాంటి ఓ స్త్రీ యదార్థ గాథే ఈ సినిమా. చదువుకోవడానికని నగరానికి వెళ్లి బలవంతంగా వ్యభిచార కూపంలోకి వెళ్లి, బయటకు వచ్చిన అమ్మాయిల అనుభవాలనే తీసుకొని ఓ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీని రూపొందించారు. ప్రజ్వల’ సంస్థ ఫౌండర్ సునీతా‌ కృష్ణన్ చెప్పిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా అనేక అవార్డులను కూడా అందుకుంది. 61వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ , స్పెషల్ జ్యూరీ మెన్షన్, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డెట్రాయిట్ ట్రినిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఫిల్మ్.. ఇలా ఎన్నో అవార్డులను ఈ మూవీ అందుకుంది ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ మూవీ అమలాపురంలో మొదలవుతుంది. శ్రీనివాస్‌ సమాజ సేవకుడిగా మంచి గుర్తింపు ఉంటుంది. అతని ఒక్కగానొక్కొ కూతురు దుర్గ తెలివైన విద్యార్థిని. ఇంటర్‌లో పాఠశాల ఫస్ట్ రావడమే కాదు, ఆ జిల్లాలోనే ఎనిమిదవ ర్యాంక్ సంపాదించుకుంటుంది. ఆ తర్వాత ఉన్నత చదువులు తన ఊరిలో కాకుండా హైదరాబాద్ వెళ్లి చదవాలనుకుంటుంది. కానీ తండ్రి మాత్రం ఇందుకు ఒప్పుకోడు.

అయితే దుర్గ వాళ్ళ నాన్నకి తెలియకుండా హైదరాబాద్ కాలేజ్ లో చేరాలని అమలాపురం నుంచి హైదరబాద్ బయలుదేరుతుంది. అయితే నగరంలో మొదటి రోజే ఓ బ్రోతల్ గ్యాంగ్ కి దొరుకుతుంది దుర్గ. అక్కడి నుంచి పది రోజులు తనని సిటీలోని పలువురు పెద్దలు రకరకాలుగా చిత్ర వధ చేస్తారు అదే సమయంలో దుర్గకి వాళ్ళ నాన్న గురించి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అసలు దుర్గకి తెలిసిన న్యూస్ ఏమిటి.? ఆ వ్యభిచార కూపంలో నుంచి దుర్గ బయటపడిందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ  సినిమా పేరు ‘నా బంగారు తల్లి’. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా’ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్ టచ్‌రివర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీనివాస్ (సిద్దీఖ్), దుర్గా (అంజలి పాటిల్) ప్రధాన పాత్రలు పోషించారు. సుమారు 2 గంటల నిడివితో ఉండే ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.