AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: పని మనిషిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో రియల్ క్రైమ్ స్టోరీ.. ట్విస్టులకు మెంటలెక్కిపోద్ది

మీకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమా? ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ మూవీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్‌ అందించింది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

OTT Movie: పని మనిషిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో రియల్ క్రైమ్ స్టోరీ.. ట్విస్టులకు మెంటలెక్కిపోద్ది
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 08, 2025 | 8:53 PM

Share

ప్రస్తుతం ఓటీటీలో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలదే హవా. ఈ జానర్ కు సంబంధించి ఏ భాషా చిత్రాలనైనా అందరూ ఎగబడి చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ కూడా కూడా ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. ఒక మర్డర్ కేసు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ముగిలన్ అనే వ్యక్తి ఒక పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ గా పనిచస్తుంటాడు. ఇదే సమయంలో కోయంబత్తూర్‌లోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త అధవన్ ఇంట్లో వారి పని మనిషి దారుణ హత్యకు గురవుతాడు. ఈ ఘటన తర్వాత అధవన్, అతని భార్య మాళవిక కూడా కనిపించకుండా పోతారు. ఈ మిస్టరీ మర్డర్ కేసును ఛేదించే బాధ్యత ముగిలన్‌కు అప్పగిస్తారు. అయితే పని మనిషి హత్య కేసులో ఈ ఇన్ స్పెక్టర్ కు ఎలాంటి క్లూస్, ఆధారాలు లభించవు. దీంతో ముగిలన్ కు అంతా అయోమయంగా అనిపిస్తుంది. అయితే విచారణ ముందుకు సాగే కొద్దీ ఈ హత్యలో సంచలన విషయాలు బయటకు వస్తాయి. పని మనిషి మర్డర్ లో ఎవరూ ఊహించని రహస్యాలు, మోసాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇంటి యజమాని అధవన్ గతంలో ఒక తెలివైన విద్యార్థి అని, అయితే తన తండ్రి మరణం తర్వాత మానసికంగా కుంగిపోయి, బైపోలార్ డిజార్డర్‌తో బాధపడ్డాడని ముగిలన్ తెలుసుకుంటాడు. దీంతో అతనిపై కూడా అనుమానపడతారు పోలీస్.

మరి ఆ పనిమనిషిని అధవనే చంపాడా? లేదా? చివరికి ఇన్‌స్పెక్టర్ ముగిలన్ ఈ కేసును ఎలా పరిష్కరించాడు. అసలు అధవన్ దంపతులు ఎందుకు కనిపించకుండా పోయారు? చివరికీ ఆ క్రిమినల్ ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలసిందే.

ఇవి కూడా చదవండి

ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు సీసా. గుణ సుబ్రమణ్యం తెరకెక్కించిన ఈ సినిమాలో నటరాజన్ సుబ్రమణ్యం, నిషాంత్ రుస్సో, పదిన్ కుమార్, నిజల్గల్ రవి, జీవ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ ఆహా తమిళ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలనూ అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈమూవీని ఎంజాయ్ చేయవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.