AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

War 2 OTT: అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి ‘వార్ 2’.. ఎన్టీఆర్‌, హృతిక్‌ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మ్యాన్ ఆఫ్ మాసెస్  జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన చిత్రం వార్ 2. ఆగస్టు 14న విడుదలైన సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీని ఓటీటీలో చూడాలని ఆడియెన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది.

War 2 OTT: అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి 'వార్ 2'.. ఎన్టీఆర్‌, హృతిక్‌ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
War 2 Movie
Basha Shek
|

Updated on: Oct 08, 2025 | 5:55 PM

Share

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా వార్ 2. ఈ ఏడాది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.  వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైంది. అభిమానులు ఊహించినంత స్థాయిలో లేనప్పటిక్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.  ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తారక్ , హృతిక్ మధ్య వచ్చే సన్నివేశాలు వార్ 2 సినిమాకు హైలెట్ గా నిలిచాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో వీరి నిరీక్షణకు తెరపడనుంది. వార్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. థియేటర్లలో రిలీజయ్యాక 8 వారాల తర్వాతే వార్ 2 సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని ముందుగానే డీల్ జరిగిందని టాక్. అందులో భాగంగానే ఇప్పటివరకు ఈ మూవీ ఓటీటీలోకి రాలేదు. అయితే ఇప్పుడు 8 వారాల గడువు పూర్తవ్వడంతో ఓటీటీ స్ట్రీమింగ్ కు లైన్ క్లియర్ అయ్యింది.

వార్ 2 సినిమా గురువారం (అక్టోబరు 09) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా పోస్టర్ ను రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా వార్ 2 సినిమాను నిర్మించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అశోతోష్ రాణా, అనిల్ కపూర్, వరుణ్ బందోలా, విజయ్ విక్రమ్ సింగ్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. అలాగే టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్, బాబీ డియోల్ క్యామియో రోల్స్ లో మెరిశారు. ప్రీతమ్ స్వరాలు అందించారు. మంచి యాక్షన్ సినిమాలు చూడాలనుకునే వారికి వార్ 2 ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల వార్ 2..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే