- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna Calls Vijay Deverakonda With This Special Nickname. Check What Is It
Vijay Deverakonda- Rashmika: రష్మిక విజయ్ దేవరకొండను ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా.. గత నాలుగు రోజులుగా వీళ్లిద్దరి పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లిపీటలెక్కనున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై అటు విజయ్ కానీ, రష్మిక కానీ అసలు నోరు మెదపడం లేదు.
Updated on: Oct 07, 2025 | 10:55 PM

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లు నిశ్చితార్థం చేసుకున్నారని గత నాలుగు రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోది. అక్టోబర్ 03 న ఉదయం విజయదేవరకొండ ఇంట్లోనే ఈ ప్రేమ పక్షులు ఉంగరాలు మార్చుకున్నారని టాక్.

అత్యంత గోప్యంగా జరిగిన విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్మెంట్ వేడుకకు కేవలం ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్-రష్మికల పెళ్లి జరగనుందని సమచారం. చాలా మంది సెలబ్రిటీ ల్లాగే వీరు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేసినట్లు సమాచారం.

అయితే బయట ఇంత జరుగుతున్నా తమ ఎంగేజ్మెంట్, పెళ్లి వార్తలపై అటు విజయ్ దేవరకొండ కానీ, ఇటు రష్మిక మందన్నా కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు కూడా రిలీజ్ చేయలేదు.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల ఎంగేజ్మెంట్ వార్తల నేపథ్యంలో ఈ ప్రేమ పక్షుల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కాగా విజయ్ దేవరకొండను రష్మిక ముద్దుగా విజ్జూ అని పిలుస్తుందట. ఇక విజయ్ కూడా రష్మికను ప్రేమతో రుషీ అని పిలుస్తాడట. గతంలో వీరు షేర్ చేసిన పోస్టులు చూస్తే వీరి ఒకరినొకరు ఎలా పిల్చుకుంటారో ఇట్టే అర్థమవుతుంది.




