AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలలో పర్యంకాసనం సేవ అంటే ఏమిటి? శ్రీవారి ఆలయంలో చివరగా జరిగే విశిష్ట పూజ రహస్యాలు

Paryankasana Seva: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ విశేషమైన సేవలు జరుగుతుంటాయి. వీటిలో అత్యంత విశిష్టమైనది రోజు చివరగా జరిగే ‘ఏకాంతసేవ’. ఆగమ శాస్త్రంలో దీనిని ‘పర్యంకాసనం’ లేదా ‘శయనాసనం’ అని కూడా అంటారు. ప్రతిరోజు రాత్రి ఆలయ కార్యక్రమాలు ముగిసిన తరువాత స్వామివారికి విశ్రాంతి కల్పించే ఈ పవిత్ర సేవ ఎంతో ఆచార సంప్రదాయాలతో నిర్వహించబడుతుంది.

తిరుమలలో పర్యంకాసనం సేవ అంటే ఏమిటి? శ్రీవారి ఆలయంలో చివరగా జరిగే విశిష్ట పూజ రహస్యాలు
Paryankasana Seva At Tirumala
Rajashekher G
|

Updated on: Mar 14, 2026 | 12:37 PM

Share

Paryankasana Meaning: కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ ఎన్నో వైభవమైన సేవలు జరుగుతుంటాయి. వాటిలో అత్యంత విశిష్టమైనది రోజు చివరగా జరిగే ‘ఏకాంతసేవ’. ఆగమ శాస్త్రంలో దీనిని ‘పర్యంకాసనం’ లేదా ‘శయనాసనం’ అని కూడా అంటారు. ప్రతిరోజు రాత్రి ఆలయ కార్యక్రమాలు ముగిసిన తరువాత స్వామివారికి విశ్రాంతి కల్పించే ఈ పవిత్ర సేవ ఎంతో ఆచార సంప్రదాయాలతో నిర్వహించబడుతుంది. ముందుగా స్వామివారి సన్నిధిలో ఉన్న మూలవిరాట్‌తో పాటు ఇతర దేవతామూర్తులకు రాత్రి తోమాలసేవలో అలంకరించిన పుష్పమాలలను సడలిస్తారు.

ఆ తరువాత బంగారు పట్టె మంచాన్ని తీసుకువచ్చి ఆనందనిలయం ముందు ఉన్న శయనమండపంలో వెండి గొలుసులతో వేలాడదీసి అమర్చుతారు. ఆ మంచంపై పట్టుపరుపు, మృదువైన దిండ్లు పరచి స్వామివారి శయనానికి సిద్ధం చేస్తారు. శయనమండపంలో అందమైన ముగ్గులు వేసి దీపాలు వెలిగించి పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తారు.

పర్యంకాసనంలో ఐదు ముఖ్య ఉపచారాలు ఉంటాయి. అవి..

  • మృగనాభి తాంబూలం (కస్తూరి సువాసనతో)
  • గంధం
  • పుష్పం
  • ప్రదక్షిణ
  • నమస్కారం

ఈ సేవకు ప్రత్యేకత ఏమిటంటే, భక్తురాలు తరిగొండ వెంగమాంబ వంశీయులు మంచం చుట్టూ రంగవల్లులు వేస్తారు. ఆ తర్వాత ఈ సేవను భోగశ్రీనివాసమూర్తికి సమర్పిస్తారు.

ధనుర్మాసంలో కృష్ణమూర్తి..

అయితే ధనుర్మాసం 30 రోజులలో ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఆ కాలంలో భోగశ్రీనివాసుని స్థానంలో వెండి కృష్ణమూర్తికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఆ సమయంలో గరుడ మండపం వద్ద సన్నాయి మేళం మ్రోగుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత భక్తిమయంగా మారుస్తుంది.

ఇక చివరగా పోటువారు వేడి ఆవుపాలను తీసుకొచ్చి సమర్పిస్తారు. ఈ విధంగా స్వామివారికి విశ్రాంతి కల్పిస్తూ రోజు చివరగా జరిగే ఏకాంతసేవ భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలకు సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది.)

Follow Us