AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sayaji Shinde: కూతురా? అని ఎగతాళి చేశారు.. నటుడు సాయాజీ షిండే, అతని భార్యల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

నటుడు సాయాజీ షిండే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకూ, తన భార్యకూ మధ్య ఉన్న వయసు వ్యత్యాసం గురించి మాట్లాడారు. సాయాజీ భార్య అల్కా షిండే అతని కంటే పదిహేను సంవత్సరాలు చిన్నదని, తమకు పెళ్లయినప్పుడు తన స్నేహితులు తనను బాగా ఆటపట్టించారని ఈ నటుడు చెప్పుకొచ్చారు.

Sayaji Shinde: కూతురా? అని ఎగతాళి చేశారు.. నటుడు సాయాజీ షిండే, అతని భార్యల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
Sayaji Shinde
Basha Shek
|

Updated on: Jul 16, 2026 | 3:35 PM

Share

సినీ పరిశ్రమలో తమకంటే చిన్నవారిని లేదా పెద్దవారిని వివాహం చేసుకున్న నటులు చాలా మంది ఉన్నారు. పది నుంచి పన్నెండేళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, చాలా మంది నటులు వివాహం చేసుకుని ఆనందంగా జీవిస్తున్నారు. అయితే ఇదే ఏజ్ గ్యాప్ కారణంగా ట్రోలింగ్ ను ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు. టాలీవుడ్ నటుడు సాయాజీ షిండే కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. తెలుగుతో పాటు మరాఠీ, హిందీ, దక్షిణాది భాషల్లో సినిమాలు చేసిన సాయాజీ అల్కా షిండేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే సయాజీ కంటే ఆయన భార్య వయసులో 15 ఏళ్లు చిన్నది. ఈ నేపథ్యంలో ఏజ్ గ్యాప్ విషయంలో స్నేహితులు ఎలా ఆట పట్టించేవారో ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారీ విలక్షణ నటుడు. ‘మా ఇద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉంది. దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. అందుకే పెళ్లి తర్వాత నా భార్యను పట్టుకుని ‘మీ అమ్మాయా?’ అని నా స్నేహితులు నన్ను ఆటపట్టించేవారు’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సాయాజీ భార్య కూడా ఈ విషయంపై మాట్లాడుతూ..

‘నా తోబుట్టువులందరూ నాకంటే పెద్దవారు. మా నాన్నగారు చనిపోయక ఒక సందర్భంలో నేను, సాయాజీ కలిశాం. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆ సమయంలో మా అన్నయ్యకు ఒకే ఒక సమస్య కనిపించింది, అదే వయసు. మా ఇద్దరి మధ్య పదిహేను సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. అందుకే ‘నువ్వెలా సర్దుకుంటావు?’ అని నన్ను అడిగారు. కానీ ఆయన మా ఫ్యామిలీని కలిశాక అంతా సర్దుకుపోయింది. మా ఇంట్లో వారందరూ సయాజీని మెచ్చుకున్నారు’ అని చెప్పుకొచ్చింది.

సాయాజీ, అల్కా మొదటిసారి ఒక ఆసుపత్రిలో కలుసుకున్నారు. ఒకసారి, అల్కా బావగారు చేరిన అదే ఆసుపత్రిలో సయాజీ కూడా చేరారని ఆమెకు తెలిసింది. అల్కా సాయాజీ షిండేకు పెద్ద అభిమాని. అందుకే ఆమె అతన్ని కలిసింది. అప్పుడు సాయాజీ ఆమెను ఏ పుస్తకం చదువుతున్నావని అడిగాడు. అప్పుడు ఆమె ఒక పుస్తకం చదువుతున్నానని చెప్పగా, సాయాజీ కూడా తాను కూడా చదువుతానంటూ ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత, రెండు మూడు నెలలకు, సయాజీ ఆ పుస్తకాన్ని తిరిగి తీసుకోవడానికి అల్కాను పిలిచాడు. అలా వారిద్దరూ స్నేహితులయ్యారు. పుస్తకాలు ఇచ్చిపుచ్చునే క్రమంలోనే వారి ద్దరి మనసులు కలిశాయి. స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. సాయాజీ షిండే భార్య, అల్కా షిండే ల వివాహం 2002లో జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us