పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే మైండ్ బ్లాంకే!
గుంటూరులోని కొత్త అంకమ్మ తల్లి ఆలయంలో పూజారిని మాయమాటలతో నమ్మించి, అమ్మవారి మంగళసూత్రాన్ని దొంగిలించిన రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు, విచారణలో అతను గతంలో 70 దేవాలయాల్లో దొంగతనాలు చేసిన గజదొంగ అని గుర్తించారు.
గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఆలయ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కొందరు భక్తుల్లా దేవాలయాలకు వెళ్లి మోసాలకు పాల్పడుతున్నారని తరచుగా వార్తలు వస్తుంటాయి. అలాంటి ఓ ఘటనే గుంటూరులో జరిగింది. గంజ్ బజార్‌లోని కొత్త అంకమ్మ తల్లి ఆలయానికి జులై 4వ తేదీన స్కూటీపై వచ్చిన కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన రాంబాబు, తాను భక్తుడిలా నటించాడు.అతను పూజారికి ₹500 ఇచ్చి ₹400 చిల్లర అడిగాడు. పూజారి చిల్లర కోసం బయటకు వెళ్లిన వెంటనే, రాంబాబు గర్భగుడిలోకి దూరి, అమ్మవారి బంగారు మంగళసూత్రంతో పాటు ఇతర ఆభరణాలు, వెండి వస్తువులను జేబులో వేసుకుని పరారయ్యాడు. ఆభరణాలు మాయమైనట్లు గుర్తించిన పూజారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన లాలాపేట సీఐ శివప్రసాద్ బృందం సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడు రాంబాబును గుర్తించి అరెస్ట్ చేసింది. అతని నుంచి దొంగిలించిన సొత్తును పోలీసులు రికవరీ చేశారు. విచారణలో రాంబాబు గతంలో సుమారు 70 దేవాలయాల్లో దొంగతనాలు చేసిన గజదొంగ అని తేలింది. ఈ దొంగతనాలతో రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్
‘ఊరు వాడ’ కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?
నాగార్జున ఆ విషయంలో రిస్క్ తీసుకుంటున్నారా..?
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

