AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక నీ సేవలు చాలు.. ఇంటికి వెళ్లు.. గంభీర్ నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్‌ కెరీర్ క్లోజ్?

Team India: భారత క్రికెట్‌లో ఒక స్వర్ణయుగం ముగియనుందా? స్టార్ ఆల్‌రౌండర్ వన్డే కెరీర్‌కు దాదాపుగా తెరపడినట్లేనని క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ దిగ్గజ ఆటగాడి స్థానంలో మరో యువ కెరటానికి పట్టం కట్టబోతున్నారు.

Venkata Chari
|

Updated on: Jul 16, 2026 | 12:57 PM

Share
సుదీర్ఘకాలం పాటు భారత క్రికెట్ జట్టుకు తన అద్భుతమైన ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్‌తో ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడు రవీంద్ర జడేజా. అయితే గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో (ప్రత్యేకించి వన్డేల్లో) అతని ఆటతీరు అంచనాలకు తగ్గట్లుగా లేదు. ముఖ్యంగా 2019 ప్రపంచకప్ తర్వాత అతని పవర్ హిట్టింగ్ సామర్థ్యం బాగా తగ్గిపోయింది. బౌలింగ్‌లోనూ మునుపటి వాడి కనిపించడం లేదు.

1 / 5
ఈ నేపథ్యంలోనే భవిష్యత్తు ప్రణాళికల్లో జడేజాను వన్డే జట్టులో ప్రధాన స్పిన్ ఆల్‌రౌండర్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ సెలెక్టర్లు సుముఖంగా లేరని తెలుస్తోంది. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు ఉంటే తప్ప అతనికి అవకాశం దక్కడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

2 / 5
రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. అక్కడి వాతావరణం, పిచ్‌లు పేస్ బౌలింగ్‌కు ఎక్కువగా సహకరిస్తాయి. కాబట్టి తుది జట్టులో ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లను ఆడించాల్సిన అవసరం ఉంది. ఇలాంటప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించగల ఒక నాణ్యమైన స్పిన్ ఆల్‌రౌండర్ జట్టుకు అత్యంత కీలకం. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలర్ అయినప్పటికీ, బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేడు. అందుకే ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న అక్షర్ పటేల్ మీద కోచ్ గౌతమ్ గంభీర్ పూర్తి నమ్మకం ఉంచాడు. అక్షర్ పటేల్ గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో, భవిష్యత్తు ప్రణాళికల్లో అతనే తొలి ఎంపికగా మారాడు.

3 / 5
కేవలం ఒకరిపైనే ఆధారపడకుండా, సరైన ప్రత్యామ్నాయ ఆటగాళ్లను సిద్ధం చేయడం గంభీర్ శైలి. ఒకవేళ టోర్నీలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు ఎదురైతే వాషింగ్టన్ సుందర్‌ను కూడా తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇది టీమిండియాకు ఒక బోనస్ లాంటిది. అంతేకాకుండా, అక్షర్ పటేల్‌కు భవిష్యత్తు ప్రత్యామ్నాయంగా, దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న యువ సంచలనం హర్ష్ దూబేను కూడా టీమ్ మేనేజ్‌మెంట్ సానబడుతున్నట్లు తెలుస్తోంది. గంభీర్ రాకతో భారత క్రికెట్‌లో మార్పులు వేగవంతం అయ్యాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

4 / 5
కాలం మారుతున్న కొద్దీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. రవీంద్ర జడేజా లాంటి దిగ్గజ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కానప్పటికీ, భారత జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ ఈ సాహసోపేతమైన అడుగులు వేస్తోంది. అక్షర్ పటేల్ ఈ గురుతర బాధ్యతను ఏ మేరకు సమర్థవంతంగా నిర్వహిస్తాడో రాబోయే సిరీస్‌లలో తేలిపోతుంది. ఏదేమైనా క్రీడాభిమానులు మాత్రం ఈ నయా టీమిండియా పయనాన్ని అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నారు.

5 / 5
Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్

మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..

తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్

నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!

యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్

బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..

అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి

క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?

ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!