AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం రూ.1,099కే స్మార్ట్​వాచ్​.. బ్లూటూత్ కాలింగ్‌తోపాటు అదిరిపోయే ఫీచర్లతో boAt Wave Call 3

స్మార్ట్‌వాచ్ కొనాలనుకునే వారికి మార్కెట్లో ఎన్నో రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే తక్కువ ధరలోనే స్టైలిష్ లుక్, పెద్ద డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు కావాలంటే కొన్ని బడ్జెట్ మోడళ్లను పరిశీలించవచ్చు. ఈ విభాగంలో boAt Wave Call 3 స్మార్ట్‌వాచ్ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్ద స్క్రీన్, ఆకట్టుకునే యానిమేటెడ్ వాచ్ ఫేసెస్, హెల్త్ ట్రాకింగ్ సదుపాయాలతో వస్తున్న ఈ వాచ్ ధర కూడా అందుబాటులోనే ఉంది.

కేవలం రూ.1,099కే స్మార్ట్​వాచ్​.. బ్లూటూత్ కాలింగ్‌తోపాటు అదిరిపోయే ఫీచర్లతో boAt Wave Call 3
Boat Wave Call 3 Smartwatch 2
Nikhil
|

Updated on: Nov 23, 2026 | 6:35 AM

Share

ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఫోన్ నోటిఫికేషన్లు తెలుసుకోవడం, కాల్స్ మాట్లాడటం, రోజువారీ ఫిట్‌నెస్ వివరాలను ట్రాక్ చేయడం వంటి పనులకు ఉపయోగపడుతున్నాయి. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని boAt Wave Call 3లో పలు స్మార్ట్ ఫీచర్లు అందించారు. ముఖ్యంగా రూ.1,500లోపు బడ్జెట్‌లో బ్లూటూత్ కాలింగ్, పెద్ద HD డిస్‌ప్లే ఉన్న వాచ్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక ఆప్షన్‌గా నిలుస్తోంది.

బ్లూటూత్ కాలింగ్

boAt Wave Call 3లో 1.83 ఇంచుల (4.64 cm) HD డిస్‌ప్లే అందించారు. ఇందులో Raise to Wake ఫీచర్ ఉండటంతో చేతిని పైకి ఎత్తగానే స్క్రీన్ ఆన్ అవుతుంది. ఫంక్షనల్ క్రౌన్‌ను తిప్పడం ద్వారా మెనూలు, వాచ్ ఫేసెస్‌ను సులభంగా మార్చుకోవచ్చు. యూజర్ల అభిరుచికి అనుగుణంగా అనేక యానిమేటెడ్, క్లౌడ్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి. సుమారు 20 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.

ఈ వాచ్‌లో Bluetooth 5.4 కనెక్టివిటీతో పాటు ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్, డయల్ ప్యాడ్ ఉన్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసి నేరుగా వాచ్ నుంచే ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ముఖ్యమైన కాంటాక్ట్స్‌ను వాచ్‌లో సేవ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేసే సమయంలో ఫోన్ తీసుకోకుండానే కాల్స్ స్వీకరించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

హెల్త్ ట్రాకింగ్

ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారి కోసం ఇందులో 24×7 హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఫీచర్లు ఉన్నాయి. మహిళల కోసం Menstrual Tracker కూడా అందించారు. రన్నింగ్, సైక్లింగ్, యోగా, క్రికెట్ వంటి స్పోర్ట్స్ మోడ్‌ల ద్వారా అడుగులు, క్యాలరీల వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఈ హెల్త్ ట్రాకింగ్ రీడింగ్స్ వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయం కావు.

boAt Wave Call 3కు IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఇచ్చారు. ఇందులో 300mAh బ్యాటరీ ఉంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు రెండు గంటలు పడుతుంది. సాధారణ వినియోగంలో 5 నుంచి 10 రోజుల వరకు, బ్లూటూత్ కాలింగ్ ఎక్కువగా ఉపయోగిస్తే 2 నుంచి 3 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని సమాచారం. మ్యూజిక్ కంట్రోల్, కెమెరా షట్టర్ కంట్రోల్, అలారం, వెదర్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ వాచ్ Bold Black, Metallic Black, Timber Brown, Aqua Blue, Spring Blossom రంగుల్లో లభిస్తుంది. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ.1,099 నుంచి రూ.1,399 మధ్యలో ఉంది. Amazon, Flipkart, boAt అధికారిక వెబ్‌సైట్‌లలో ఆఫర్లను బట్టి Metallic వేరియంట్ ధర రూ.1,599 వరకు ఉండొచ్చు. కంపెనీ ఒక సంవత్సరం వారంటీని అందిస్తోంది. రూ.1,500లోపు బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కావాలనుకునేవారు ఈ మోడల్‌ను పరిశీలించవచ్చు.

Follow Us